మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహార పదార్థాలేంటో తెలుసా.. !

కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని తెలిసిందే. అయితే రోజు జరిగే ఎన్నో పనులతో brain ఎంత అలసిపోతుంది. దీనికి నూతన ఉత్తేజ అందించాలి అంటే.

మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహార పదార్థాలేంటో తెలుసా.. !
Food for brain health


Brain health : కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల brain చురుగ్గా పనిచేస్తుందని తెలిసిందే. అయితే రోజు జరిగే ఎన్నో పనులతో brain ఎంత అలసిపోతుంది. దీనికి నూతన ఉత్తేజ అందించాలి అంటే.. ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి. అలాగే సరైన పోషకాహారం తీసుకోవాలి. అలా కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు నష్టం పోయే అవకాశం ఉందని తెలుస్తోంది...

వాల్నట్, బెండకాయలు, డ్రై ఫ్రూట్స్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందు ఉంటాయని తెలుస్తోంది. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు మెదడుకి చెడు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల క్రమేపి మెదడు పనితీరు తగ్గిపోతుందని తెలుస్తోంది అవి ఏంటంటే.. 

చక్కెర సంబంధిత పదార్థాలు.. 

చక్కెరకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి హాని జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే వీటిని తరచు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు సైతం దెబ్బతింటుందని తాజా అధ్యయనాల్లో తెలిసింది.. అందుకే ఏ వయసు వారైనా దీనికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిదని తెలుస్తోంది.. 

Worst Foods for Brain Health - Brain Balance Achievement Centers

ఉప్పు.. 

ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది.. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు దీన్ని తీసుకోవద్దని పలుమార్లు హెచ్చరిస్తూనే ఉంటారు. అంతేకాకుండా తరచూ దీన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా గుండెతో పాటు మెదడు ఆరోగ్యం సైతం దెబ్బతింటుందని దీనికి సంబంధించి ఎన్నో సమస్యలు వస్తాయని తెలుస్తోంది.. అలాగే శరీరం విపరీతంగా డిహైడ్రేటుకు గురవుతుందని అంతేకాకుండా ఆలోచన సామర్థ్యం సైతం దెబ్బ తినే అవకాశం ఉందని తెలుస్తోంది.. 

మద్యం.. 

మద్యం అధికంగా తీసుకోవడం వల్ల ఆలోచనలు పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీని వలన కాలేయం పనితీరు సైతం దెబ్బతింటుంది. అంతేకాకుండా మెదడు దెబ్బతినే అవకాశం ఉందని, ఆలోచన తీరు బలహీనపడే అవకాశం ఉందని తెలుస్తోంది.. అంతేకాకుండా తరచూ మద్యాన్ని తీసుకోవడం వల్ల చిన్న చిన్న విషయాలకు సైతం ఎక్కువగా కంగారు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది..

మాంసాహార పదార్థాలు.. 

అధికంగా మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేయడం మానేస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా తలంతా బరువుగా అనిపిస్తూ ఏ పని మీద ఏకాగ్రత కుదరదని.. అందుకే అధికంగా మాంసాహార పదార్థాలను మసాలా పదార్థాలను తీసుకోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.