మదర్స్ డే స్పెషల్.. అమ్మకు గిఫ్ట్ ఏం ఇవ్వాలని ఆలోచిస్తున్నారా.. ఆరోగ్యాన్ని ఇచ్చేయండి..!

ఈ సృష్టిలో అన్నిటికన్నా అందమైన రూపం అమ్మ.. నీ స్వార్థమైన రూపం అమ్మతనం.. బిడ్డ కడుపున పడిన దగ్గర నుంచి ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చే అమ్మకు మన జీవితాంతం కష్టపడిన రుణం తీర్చుకోలేము సంవత్సరానికి ఒకసారి వచ్చే మదర్స్ డే

మదర్స్ డే స్పెషల్.. అమ్మకు గిఫ్ట్ ఏం ఇవ్వాలని ఆలోచిస్తున్నారా.. ఆరోగ్యాన్ని ఇచ్చేయండి..!


ఈ సృష్టిలో అన్నిటికన్నా అందమైన రూపం అమ్మ.. నీ స్వార్థమైన రూపం అమ్మతనం.. బిడ్డ కడుపున పడిన దగ్గర నుంచి ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చే అమ్మకు మన జీవితాంతం కష్టపడిన రుణం తీర్చుకోలేము సంవత్సరానికి ఒకసారి వచ్చే మదర్స్ డే రోజైనా కచ్చితంగా అమ్మకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే.. అయితే అమ్మ ఆనందపడేలా ఆరోగ్యంగా ఉండేలా ఏం చేయొచ్చు ఒకసారి తెలుసుకుందాం..

Mother's Day 2023: 150+ Quotes, Wishes, Captions, Greetings and Messages to  Touch Mom's Heart - MySmartPrice

మే 14న మదర్స్ డే.. ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం జరుపుకునే ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.. ఈరోజును అమ్మను ఆనందపెట్టాలంటే కొన్ని పనులు కచ్చితంగా చేస్తే రావాల్సిందే.. అందులో అమ్మకు ఇష్టమైన కొన్ని సెలెక్ట్ చేసి ఇచ్చేస్తే సరి..

హెల్త్ ఇన్సూరెన్స్..

ఈ విషయం ఆలోచించడానికి కష్టంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అయినా అమ్మకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.. గత పది ఏళ్లలో 40 ఏళ్లు దాటిన వెంటనే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతున్నాయి. మహిళల్లో సైతం గుండెకు సంబంధించిన సమస్యలు.. బిపి.. రక్తపోటు వంటివి వేధిస్తున్నాయి. ఏ రోజు ఏ సమస్య వస్తుందో ఎవరు ఊహించలేరు కనీసం సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి కైనా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. అందుకే అమ్మ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోండి.

హోమ్ నీడ్స్.. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఎన్నో రకాల పనులతో సతమతమయ్య అమ్మకు కాస్తయినా రెస్ట్ ఇస్తే ఆరోగ్యాన్ని అందించినట్టే అందుకే ఇంట్లో లేని అత్యంత అవసరమైన వస్తువులను చూసి అమ్మకు గిఫ్ట్ గా ఇచ్చేయండి అందులో ముఖ్యంగా వాషింగ్ మిషన్, డిష్ వాషర్, మైక్రో ఓవెన్ లాంటివి ఏవైనా గిఫ్ట్ గా ట్రై చేస్తే సరి..

హెల్త్ కేర్ ప్రొడక్ట్స్..

తరచూ అమ్మ నోటి నుంచి నడునొప్పి కాళ్ళు నొప్పులు కీళ్ల నొప్పులు అనే మాటలు వింటూనే ఉంటాము కానీ ఈ విషయాలని పెద్దగా సీరియస్గా తీసుకోము. ఇప్పటికైనా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అమ్మకుండా ఆరోగ్య సమస్యలు పూర్తిగా తెలుసుకోండి వీలైతే ఆసుపత్రికి తీసుకు వెళ్ళటం నొప్పులను తగ్గించే హీట్ పాడ్స్, పని తగ్గించే వస్తువులు గిఫ్ట్ గా ఇచ్చేస్తే సరి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.