ఎక్కువ మోతాదులో నీళ్లు తాగితే ఏమవుతుంది.?

కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగితే...కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుందని అనుకుంటారు. అన్నేసి నీళ్లు తాగితే....కిడ్నీలకు లోడ్‌ అవుతుందని అంటారు. ఒకేసారి 5, 6 లీటర్లు తాగితే కిడ్నీలకు భారం కదా అందుకని అన్నీ తాగొద్దు అంటారు.

ఎక్కువ మోతాదులో నీళ్లు తాగితే ఏమవుతుంది.?


కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగితే...కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుందని అనుకుంటారు. అన్నేసి నీళ్లు తాగితే....కిడ్నీలకు లోడ్‌ అవుతుందని అంటారు. ఒకేసారి 5, 6 లీటర్లు తాగితే కిడ్నీలకు భారం కదా అందుకని అన్నీ తాగొద్దు అంటారు.

When's the Best Time to Drink Water and Stay Hydrated | Health

మనం రోజూ తాగే నీళ్లు పొట్టలోకి వెళ్లి ఆ తర్వాత కిడ్నీలకు వెళ్లిపోతాయి అనుకోవచ్చు. ఒకవేళ అలా నిజంగా డైరక్ట్‌గా వెళ్లిపోతే వెంటనే యూరిన్‌ వచ్చేయాలి కదా. అలా వస్తుందో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉదయాన్నే లేస్తాం...మిగిలినవి పొద్దున్నే పాస్‌ రూపంలో బయటకొచ్చేస్తుంది. తర్వాతా తాగిన నీళ్లు పొట్ట, ప్రేగులకు వెళ్తాయనుకుంటే...అక్కడ 10 నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఉండవు. ఖాళీ అయిపోతాయి. మరి ఆ వెంటనే యూరిన్‌ వచ్చేయాలి కదా. అంటే తాగిన నీళ్లు ఎప్పుడూ కిడ్నీలకు వెళ్లవు. అలా ఒత్తిడి పడదు. ఆ అవకాశం లేదు. అది కేవలం మన అపొహ మాత్రమే.

నీళ్లు అనేవి డైరక్ట్‌గా కిడ్నీలకు వెళ్లవు. నీళ్లు తాగిన వెంటనే పొట్ట, ప్రేగులు పీల్చుకుని రక్తంలోకి వెళ్తుంది. దాని తర్వాత లివర్‌లోకి వెళ్తుంది. ఎందుకంటే ఏదో ఒక రూపంలో వ్యర్థాలనేవి శరీరంలోకి వెళ్తుంటాయి. అందుకే మనం నీళ్లు తాగగానే లివర్‌ వాటిని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసిన రక్తాన్ని, నీళ్లను లివర్‌...గుండెకు పంపుతుంది. ఆతర్వాత శరీరంలోకి పంపుతుంది. అప్పుడు నీళ్లన్నీ శరీరంలోకి సర్య్కూలేట్‌ అవుతుంది. అలా వెళ్లాక మొత్తం శరీరంలో ఉండే వ్యర్థాలన్నీ కిడ్నీలకు వెళ్తే....అప్పుడు కిడ్నీలు వాటిని ఫిల్టర్‌ చేస్తాయి. ఆ తర్వాత వ్యర్థాలు యూరిన్‌ రూపంలో బయటకు వెళ్లిపోతాయి.

అసలు కిడ్నీలు చేసే పనేంటీ....శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడం. ఎప్పటికప్పుడు క్రిములను పంపించేస్తాయి. కాబట్టి వ్యర్థాలు బయటకు వెళ్లాలంటే నీళ్లు తాగాలి. ఎప్పుడైనా ఒక డబ్బాలో నీళ్లు పోస్తే మొత్తం కరెక్ట్‌గా సరిపోతే బయటకు రావు. కానీ ఎక్కువైపోతే మాత్రం పొంగి కిందపడిపోతాయి. అదే సూత్రం కిడ్నీలకు వర్తిస్తుంది. నీళ్లు శరీరానికి అవసరమైనవి కిడ్నీలు ఉంచుకుని మిగతా నీళ్లను యూరిన్‌ రూపంలో పంపించేస్తుంది. కేవలం వ్యర్థాలు మాత్రమే బయటకు పోలేవు. దానికి ద్రవరూపం కావాలి.

ఇంట్లో నీళ్లు పోస్తే చెత్త ఎలా పోతుందో...శరీరంలో ఉండే వ్యర్థాలు కూడా బయటకు వచ్చేస్తాయి.ఇలా తరచు నీళ్లు తాగడం వల్ల యూరిన్‌ కూడా తెల్లగా ఉంటుంది. ఇక పసుపుగా కూడా రాదు. పసుపుగా ఉంది అంటే మాత్రం. మన శరీరంలో నీళ్ల శాతం లేనట్టని అర్థం. అందుకే క్రీడాకారులకు 5, 6 లీటర్లు తాగమని చెప్తారు. మరి వాళ్లకి కిడ్నీలు 4, 5 ఉండవుగా. అందరికీ ఒకటేగా. కాబట్టి నీళ్లు ఎన్ని తాగినా ఏమీ కాదు. ఎంత తాగితే అంత శరీరం శుభ్రం అవతుంది. అంతే తప్ప ఇంకేమీ కాదు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.