షుగర్ వ్యాధి రాకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.. !

Diabetes  : మధుమేహం సమస్య ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తుంది చిన్న వయసులోనే చాలామందిలో ఈ సమస్య కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తుంది అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు

షుగర్ వ్యాధి రాకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.. !
How to control diabetes


మధుమేహం సమస్య ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తుంది చిన్న వయసులోనే చాలామందిలో ఈ సమస్య కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తుంది అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ వ్యాధిని దూరం చేసుకోవచ్చని తెలుస్తోంది..

చిన్న వయసు నుంచి కొన్ని రకాల ఆహారపు అలవాట్లు జీవన శైలి అలవాటు చేసుకుంటే షుగర్ వ్యాధి రాకుండా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.. షుగర్ వ్యాధి ముఖ్యంగా వంశపారపర్యంగా వచ్చే వ్యాధి.. అందుకే చాలా వరకు చిన్న వయసులోనే దీనిని గుర్తించవచ్చు తల్లి తండ్రి ఎవరో ఒకరికి షుగర్ ఉంటే పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఇలాంటివారు 30 ఏళ్ల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే తర్వాత షుగర్ వచ్చే రిస్క్ ను చాలా వరకు తగ్గించుకోవచ్చు...

ముఖ్యంగా తీసుకునే ఆహారాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం ఎందుకోసం మధ్యాహ్నం సమయంలో రైస్ తో పాటు నచ్చిన ఆహార పదార్థాలు తిన్న రాత్రి సమయంలో మాత్రం రోటి వంటివి అలవాటు చేసుకోవాలి ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలో కంట్రోల్లో ఉంటాయి..

అలాగే కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకుంటూ ఉండాలి బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కూడా చాలా వరకు తగ్గించాలి.. సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందని తెలుస్తోంది. అలాగే రోజు కచ్చితంగా ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.. 

చాలామందికి రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది ఈ అలవాటును మానుకోవాలి రాత్రి భోజనానికి నిద్రకి మధ్య రెండు గంటల సమయం ఉండే విధంగా చూసుకోవాలి అలాగే భోజనం అనంతరం కాసేపు నడవడం అలవాటు చేసుకోవాలి.. 

అలాగే ఈ వయసు నుంచే వ్యాయామని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. వారానికి కనీసం ఐదు రోజులు ఏదో ఒక రకమైన వ్యాయామాన్ని ఎంచుకోవడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి వ్యాధులు సైతం దరి చేరవు.. వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.. ఉద్యోగ విషయంలో ఇంట్లో సమస్యలతో ఏర్పడే ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలి.. సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి ఇలాంటి క్రమంలో ఎలాంటి చెడు వ్యసనాలకు లోన్ అవ్వకూడదు ముఖ్యంగా మధ్యపానం ధూమపానం వంటి వాటిని దూరంగా ఉంచడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచవచ్చని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.