చింతచిగురుతో ఇక చింత అక్కర్లే.. ఎండాకాలం తిన్నారంటే.. ఎన్ని లాభాలో

చింతచిగురు.. అసలు ఈ పేరు వినగానే.. నోట్లో నీళ్లు ఊరిపోతాయి.. కాదా.. సిటీల్లో అయితే ఇది అరుదుగా ఉంటుంది కానీ.. ఈ సీజన్‌లో ఊర్లకు వెళ్తే.. ఎక్కడ చూసినా చింతచెట్లకు చిగురు విపరీతంగా కనిపిస్తుంది. సమ్మర్‌ స్పెషల్‌గా మనం చింతచిగురు

చింతచిగురుతో ఇక చింత అక్కర్లే.. ఎండాకాలం తిన్నారంటే.. ఎన్ని లాభాలో


చింతచిగురు.. అసలు ఈ పేరు వినగానే.. నోట్లో నీళ్లు ఊరిపోతాయి.. కాదా.. సిటీల్లో అయితే ఇది అరుదుగా ఉంటుంది కానీ.. ఈ సీజన్‌లో ఊర్లకు వెళ్తే.. ఎక్కడ చూసినా చింతచెట్లకు చిగురు విపరీతంగా కనిపిస్తుంది. సమ్మర్‌ స్పెషల్‌గా మనం చింతచిగురును చెప్పుకోవచ్చు.. ఈ ఎండాకాలం అంతా.. చింట చెట్లకు తెగ చిగురు ఉంటుంది. ఇక పల్లెటూర్లలో చిన్నాపెద్దా, ఆడమగా అని తేడా లేకుండా.. అందరూ చెట్లెక్కేసి చిగురుకోస్తారు.. ఈ కూరతో పప్పు, ఇగురు ఏది చేసినా అద్భుతమే... కేవలం రుచి మాత్రమేనా.. చింతచిగురు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..!


చింత చిగురులో డైటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో విరేచనం సులభంగా అవుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే పైల్స్‌ సమస్య తగ్గుతుంది.

చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.

చలి జ్వరం వచ్చిన వారు చింత చిగురును తింటే జ్వరం నుంచి బయట పడవచ్చు. చింత చిగురులో ఉండే ఔషధ గుణాలు ఇన్‌ఫెక్షన్లపై పోరాడుతాయి.

చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. చింత చిగురులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి.

నోట్లో పుళ్లు, పొక్కులు ఏర్పడ్డవారు చింత చిగురును తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.

చింత చిగురును తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.. 

కడుపులో నులి పురుగుల సమస్యలతో బాధపడే పిల్లలకు చింత చిగురును తినిపిస్తే సమస్య తగ్గుతుంది.

చింత చిగురులో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

పలు రకాల క్యాన్సర్లు రాకుండా చేసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.

తరచూ చింత చిగురును తింటుంటే ఎముకలు దృఢంగా మారుతాయి. థైరాయిడ్‌, డయాబెటిస్‌ సమస్యలతో బాధపడేవారు చింత చిగురును ఆహారంలో భాగంగా చేసుకుంటే ఫలితం ఉంటుంది.

చింత చిగురును తింటే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నేత్ర సమస్యలు తగ్గుతాయి.

అయితే మరీ ఎక్కువగా తింటే బాడీ హీట్‌ అవుతుంది.. కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లు ఓకే..! అంతకు మించితేనే వేడి చేస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.