గడ్డం, మీసం పెరగడం లేదని బాధపడుతున్నారా బాయ్స్‌..? ఇలా చేయండి.!

ఒకప్పుడు గడ్డం పెంచితే.. లవ్‌ ఫెయిల్యూర్‌ అనేవాళ్లు.. కానీ ఇప్పుడు గడ్డం లేకుండా ఏ అబ్బాయి ఉండటం లేదు.. ఇదే ట్రెండ్‌ అయిపోయింది. ఎంతలా అంటే. క్లీన్ షేవ్‌తో రావాలని కంపెనీలు రూల్‌ పెడితే

గడ్డం, మీసం పెరగడం లేదని బాధపడుతున్నారా బాయ్స్‌..? ఇలా చేయండి.!


ఒకప్పుడు గడ్డం పెంచితే.. లవ్‌ ఫెయిల్యూర్‌ అనేవాళ్లు.. కానీ ఇప్పుడు గడ్డం లేకుండా ఏ అబ్బాయి ఉండటం లేదు.. ఇదే ట్రెండ్‌ అయిపోయింది. ఎంతలా అంటే. క్లీన్ షేవ్‌తో రావాలని కంపెనీలు రూల్‌ పెడితే ఆ జాబ్‌ కూడా వదిలేసేంతలా..! అయితే చాలామందికి గడ్డం బాగా పెంచాలి, మంచి షేప్‌లో కట్‌ చేయించుకోవాలి అని ఉంటుంది. కానీ అది ఏంట్రా అంటే పెరిగి సావదు.. అక్కడకక్కడ పలుచగా ఉంటూ చాలా చిరాకుగా ఉంటుంది. బీయర్డ్‌ గ్రోత్‌ కోసం ఆయిల్స్‌ కూడా వాడేవాళ్లు ఉన్నారు. మీరు కూడా మీ గడ్డం పెంచుకోవాలంటే అబ్బాయిలూ.. ఈ చిన్న టిప్‌ ట్రే చేసి చూడండి.. అదిరిపోతుంది.! 
Top 15 Stubble Beard Styles for Men: How to Guide + Examples • The Beard  Struggle
ఈ చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి గ‌డ్డం, మీసం స‌రిగ్గా పెరిగేలా చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల తెల్ల‌గా ఉన్న గ‌డ్డం కూడా న‌ల్ల‌గా మారుతుంది. వారం రోజుల పాటు వాడ‌డం వ‌ల్ల గ‌డ్డం ఒత్తుగా, గుబురుగా పెరుగుతుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ క‌ల‌బంద గుజ్జును తీసుకోవాలి. త‌రువాత ఈ గుజ్జులో ఒక విట‌మిన్ ఇ విటమిన్‌ క్యాప్సుల్స్‌ను వేయాలి. త‌రువాత ఈ రెండింటిని ఒక నిమిషం పాటు బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని వాడే ముందు ముఖాన్ని నీటితో శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌డి లేకుండా ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీసం, గ‌డ్డం ఉండే చోట చ‌ర్మం పై రాసుకోవాలి.
ఈ మిశ్ర‌మం చ‌ర్మంలోకి ఇంకేలా మృదువుగా మ‌ర్దనా చేసుకోవాలి. ఇలా మిశ్ర‌మాన్ని గంట‌న్న‌ర నుంచి రెండు గంట‌ల పాటు అలాగే ఉంచిన త‌రువాత చ‌ల్ల‌టి నీటితో లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిని మ‌రో విధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని రాత్రి ప‌డుకునే ముందు రాసుకుని ఉద‌యాన్నే క‌డిగి వేయాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డం వ‌ల్ల గ‌డ్డం, మీసం పెరుగుద‌ల‌లో వ‌చ్చే మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు. గ‌డ్డం గుబురుగా, ఒత్తుగా పెరుగుతుంది. గ‌డ్డం, మీసం ప‌లుచ‌గా ఉంద‌ని, పెర‌గ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్న యువ‌కులు ఈ చిట్కాను ట్రై చేయండి..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.