ఈ ఆటో ఇమ్యూనో డిసీజ్ లతో జాగ్రత్త సుమా.. !

మనిషిని రోగ నిరోధక వ్యవస్థ ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది.. మన శరీరం పైన ఎటువంటి హానికర వైరస్, బ్యాక్టీరియా లాంటివి దాడి చేసిన వాటిని నిరోధించడంలో సహాయపడుతుంది..

ఈ ఆటో ఇమ్యూనో డిసీజ్ లతో జాగ్రత్త సుమా.. !


Autoimmune Disease  : మనిషిని రోగ నిరోధక వ్యవస్థ ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది.. మన శరీరం పైన ఎటువంటి హానికర వైరస్, బ్యాక్టీరియా లాంటివి దాడి చేసిన వాటిని నిరోధించడంలో సహాయపడుతుంది.. అయితే కొన్ని సందర్భాల్లో రక్షించాల్సిన ఈ రోగ నిరోధక వ్యవస్థ తమ సొంత శరీరం పైన దాడి చేస్తుంది.. ఇలాంటి సమయంలోనే ఆటో ఇమ్యును డిసీజ్ లు వస్తాయి.. 

ఆటో ఇమ్యూనో డిసీజ్ లు శరీరం మీద రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి.. ఇవి సొంత శరీరం పైన వ్యతిరేకంగా పనిచేస్తాయి.. అందువలన ఇవి ప్రమాదకరమనే చెప్పాలి.. ఈ ఆటో ఇమ్యునో డిసీజ్ లో పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది..  అందులో ముఖ్యంగా రక్తహీనత, కండరాల నొప్పులు, మధుమేహం, థైరాయిడ్, సొరియాసిస్ వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి.. 

థైరాయిడ్:  థైరాయిడ్ ఒక రకంగా ఆటో ఇమ్మూనో డిసీస్ అని చెప్పవచ్చు.   ఇందులో ముఖ్యంగా శరీరంలో తయారైన యాంటీ బాడీలు థైరాయిడ్ గ్రంధి కి వ్యాపిస్తాయి.. దీనివలన మలబద్ధకం, డిప్రెషన్, అలసట, నీరసం, విపరీతంగా జుట్టు ఊడిపోవడం, కాళ్లు.. చేతులు వాపు వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి..

రుమటాయిడ్ ఆర్థరైటిస్ : ఆటో ఇమ్యునోడిసిజ్లో కండరాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.. ఇందులో ముఖ్యంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో శరీరానికి ఇరువైపులా ఉండే కీళ్లకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.. దీంతో విపరీతంగా కీళ్లనొప్పులు వేధిస్తాయి..

సోరియాసిస్ : ఇది ఒక రకమైన చర్మవ్యాధి.. దీనిలో శరీరం అంతా పొలుసులుగా మారుతుంది.. ముఖ్యంగా ఇది స్త్రీ, పురుషులు ఇద్దరికీ వచ్చే వ్యాధి.. ఎక్కువగా మోచేతులు, మోకాలు వంటి వాటిపైన ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.. ఇందులో చర్మం పొడిగా మారిపోవడం.. చర్మం మీద పగుళ్లు, జుట్టు రాలిపోవడం, చర్మ ఎర్రబడటం వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి.. 

మధుమేహం : ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీస్.. మధుమేహం వచ్చిన వారికి అధిక దాహం వేయడం.. అతిమూత్రం.. బరువు తగ్గటం.. ఆకలి.. నీరసం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.. అలాగే కాళ్లు, చేతులు తిమ్మిరి పట్టడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.. 

అందుకే ఈ ఆటో ఇమ్మునో డిసీజ్ లను మొదట్లోనే గుర్తించాలి.. దీని తగిన విధంగా చికిత్స తీసుకోవడం వల్ల పెను ప్రమాదాల నుండి రక్షించుకోవచ్చు.. ముఖ్యంగా విపరీతంగా కీళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.