గ్రీన్‌ కాఫీ గురించి తెలుసా..? బీపీ, షుగర్‌ తగ్గిస్తుందంటున్న స్టడీ

ఉదయం లేవగానే కప్పు కాఫీ తాగిందే రోజు స్టాట్‌ అవదు. అవతల ఎంత అర్జెంట్‌ పని ఉన్నా సరే.. కప్పులో కాఫీ పోసుకుని బాల్కనీలో కుర్చోని తాగుతుంటే.. ఆ మజానే వేరు. డేను ప్రశాంతంగా స్టాట్‌ చేసినట్లు అవుతుంది.

గ్రీన్‌ కాఫీ గురించి తెలుసా..? బీపీ, షుగర్‌ తగ్గిస్తుందంటున్న స్టడీ


ఉదయం లేవగానే కప్పు కాఫీ తాగిందే రోజు స్టాట్‌ అవదు. అవతల ఎంత అర్జెంట్‌ పని ఉన్నా సరే.. కప్పులో కాఫీ పోసుకుని బాల్కనీలో కుర్చోని తాగుతుంటే.. ఆ మజానే వేరు. డేను ప్రశాంతంగా స్టాట్‌ చేసినట్లు అవుతుంది. అయితే మీరు ఎప్పుడు తాగే కాఫీ టేస్ట్‌గానే ఉంటుంది.. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. కానీ హెల్తీ కాఫీ, తాగితే బరువు దెబ్బకు దిగాల్సిందే అంటే.. గ్రీన్ కాఫీ గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఇటీవల కాలంలో బరువు తగ్గాలని అనుకునే వారు మాత్రం దీన్ని ఎక్కువగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. 
Is green coffee the next superfood for weight loss? Here's what we know  about the new antioxidant on the block | Health and Wellness News - The  Indian Express
సాధారణంగా కాఫీ గింజలు నల్లగా ఉంటాయి. అయితే చెట్టు నుంచి కోసేప్పుడు అవి పచ్చగానే ఉంటాయి. వాటిని ఎండబెట్టి రోస్ట్‌ చేసేసరికల్లా దానిలో పరిమళం ఇంకా పెరిగి నల్లగా తయారవుతాయి. అందువల్లనే కాఫీకి ఆ రుచి, రంగు వస్తాయి. అయితే వీటిని రోజ్ట్‌ చేయకుండా అలానే ఉంచి కాఫీ తయారు చేసుకుంటే దాన్నే గ్రీన్‌ కాఫీ అంటారు. దీనిలో కెఫీన్‌ తక్కువగా ఉంటుంది. అందుకనే మధుమేహం, బీపీ, ఊబకాయం, ఎక్కువ కొలస్ట్రాల్‌ ఉన్నవాళ్లకు ఈ కాఫీ బాగా పనిచేస్తుంది.
ఒక కప్పు మామూలు కాఫీని తాగడంతో పోలిస్తే గ్రీన్‌ కాఫీని తాగడం వల్ల 25 నుంచి 50 శాతం వరకు కెఫీన్‌ తక్కువగా మన శరీరానికి అందుతుంది. అందువల్ల కెఫీన్‌తో వచ్చే దుష్ప్రభావాలు చాలా వరకు తగ్గిపోతాయి. బరువు తగ్గాలని అనుకునే వారు ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. 12 వారాల పాటు రోజూ క్రమం తప్పకుండా తాగుతూ ఉండటం వల్ల బరువు తగ్గినట్లు కొన్ని పరిశోధనలో తేలింది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని ఎలాంటి అనుమానమూ లేకుండా తాగవచ్చు. దీనిలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అనేది పిండి పదార్థాల్ని శరీరం ఎక్కువగా శోషించుకోనీయకుండా అడ్డు పడుతుంది. అందువల్ల షుగర్‌ ఒక్కసారిగా పెరగడం, మధుమేహం రావడం లాంటివి చాలా వరకు తగ్గుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఫ్రీ రాడికల్స్‌ వల్ల చర్మ కణాలు నష్ట పోకుండా ఉండేలా చేస్తుంది. అందువల్ల చర్మం ముడతలు రావడం, గీతలు పడటం లాంటి వయసు సంబంధిత సమస్యలన్నీ దరి చేరకుండా ఉంటాయి.
గ్రీన్‌ కాఫీని మంచి సహజమైన డిటాక్సిఫయర్‌గా చెబుతారు. దీన్ని క్రమం తప్పకుండా రోజూ ఒక కప్పు చొప్పున తీసుకుంటూ ఉండటం వల్ల విష పదార్థాలు, వ్యర్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలాగే అధికంగా ఉండే కొవ్వుల్ని కూడా ఇది కరిగిస్తుంది. ఫలితంగా అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలు తగ్గుముఖం పడతాయి. 
ఈ గ్రీన్‌ కాఫీ ఒత్తిడిని తగ్గిస్తుంది. స్ట్రెస్‌ హార్మోన్‌ స్థాయిలు తగ్గడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రక్తపోటూ అదుపులో ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అతిగా తాగితే.. ఆరోగ్యం పాడవుతుంది. రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల వరకు మాత్రమే దీన్ని తాగవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.