ఆవు పాలల్లో ఆవు నెయ్యి కలిపి తాగితే మలబద్ధకం మాటే ఉండదు..!

ఈరోజుల్లో చాలమంది తిన్నది అరగక గ్యాస్‌, యసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతే ఎక్కువగా వీటితో ఇబ్బందిపడుతున్నారు. కడుపునిండా తినడం ఎంత ముఖ్యమో.. అది అరిగించుకోవడం కూడా అంతే ముఖ్యం. మలబద్ధకం దీర్ఘకాలంగా ఉంటే.. అది మీ ప్రేగులను దెబ్బతీస్తుంది. మొలలు, క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది

ఆవు పాలల్లో ఆవు నెయ్యి కలిపి తాగితే మలబద్ధకం మాటే ఉండదు..!


ఈరోజుల్లో చాలమంది తిన్నది అరగక గ్యాస్‌, యసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతే ఎక్కువగా వీటితో ఇబ్బందిపడుతున్నారు. కడుపునిండా తినడం ఎంత ముఖ్యమో.. అది అరిగించుకోవడం కూడా అంతే ముఖ్యం. మలబద్ధకం దీర్ఘకాలంగా ఉంటే.. అది మీ ప్రేగులను దెబ్బతీస్తుంది. మొలలు, క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. నడుమునొప్పి, వెన్నునొప్పి, శరీరం నుంచి దుర్వాసన ఇవన్నీ మలబద్ధకం వల్ల వచ్చే సమస్యలే. దీని నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. కొందరు అయితే ట్యాబ్లెట్స్‌ కూడా వాడతారు. ఈ సమస్య ఎక్కువగా కుర్చోని పని చేసేవాళ్లకు వస్తుంది. అయితే కింద తెలిపిన అద్భుత‌మైన చిట్కాను పాటిస్తే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కా ఏమిటంటే..
Benefits Of Drinking Cow Milk Regularly -
రాత్రి పూట నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని ఆవు పాల‌లో 1 టీస్పూన్ ఆవు నెయ్యి క‌లిపి తాగండి. ఈ మిశ్ర‌మం మ‌ల‌బ‌ద్ద‌కానికి అద్భుతంగా ప‌నిచేస్తుంది. మ‌రుస‌టి రోజు పేగులు మొత్తం క్లీన్ అవుతాయి. మ‌లం అంతా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. ఇలా రోజూ పాటిస్తే కొద్ది రోజుల‌కు ఈ స‌మ‌స్య పూర్తిగా నయం అవుతుంది. బాత్రూమ్‌లో కుర్చోని కుస్తీపోట్లు పడాల్సిన పని ఉండదు. సాఫీగా అవుతుంది. చాలా మంది డైజెషన్‌ సమస్యను లైట్‌ తీసుకుంటారు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని మీకు తెలుసా..?
రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం, వేళ‌కు భోజ‌నం చేసి నిద్రించ‌డం.. ఫైబ‌ర్ అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వంటి సూచ‌న‌లు పాటిస్తే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మస్యే ఉండ‌దు. దీంతో జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లైన అజీర్ణం, గ్యాస్‌, క‌డుపులో మంట ఉండ‌వు. దీంతో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు.. బయటిఫుడ్స్‌ను తక్కువగా తినాలి, అసలు తినకపోవడం మంచిది. అలాగే బిర్యానీలు కూడా తగ్గించాలి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.