గ్యాస్ట్రిక్‌ సమస్య నుంచి వెంటనే రిలీఫ్‌ అవ్వాలంటే ఇవి తినండి..!!

మనిషిని ఈ గ్యాస్‌ సమస్య అతలాకుతలం చేస్తుంది. కాస్త కడుపునిండా తిన్నామంటే.. పొట్ట ఉబ్బిపోయినట్లు ఉంటుంది. అసలు ఈరోజుల్లో.. గ్యాస్‌ వల్ల..చిన్నపెద్దా తేడా లేకుండా అందరూ బాధపడుతున్నారు. గ్యాస్‌ నొప్పికి

గ్యాస్ట్రిక్‌ సమస్య నుంచి వెంటనే రిలీఫ్‌ అవ్వాలంటే ఇవి తినండి..!!


మనిషిని ఈ గ్యాస్‌ సమస్య అతలాకుతలం చేస్తుంది. కాస్త కడుపునిండా తిన్నామంటే.. పొట్ట ఉబ్బిపోయినట్లు ఉంటుంది. అసలు ఈరోజుల్లో.. గ్యాస్‌ వల్ల..చిన్నపెద్దా తేడా లేకుండా అందరూ బాధపడుతున్నారు. గ్యాస్‌ నొప్పికి గుండెనొప్పికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది..దాంతో ఏది ఏ నొప్పో తెలియక ఇబ్బందిపడతారు. మీకు కూడా గ్యాస్ట్రిక్‌ సమస్య ఉంటే.. ఈ పండ్లను తినండి. వెంట‌నే రిలీఫ్ వ‌స్తుంది. మ‌రి ఆ పండ్లు ఏమిటంటే..
అర‌టి పండ్లు మ‌న‌కు ఏ సీజన్‌లో అయినా ల‌భిస్తాయి. వీటిని రోజూ తిన‌వ‌చ్చు. అర‌టిపండ్ల‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. భోజ‌నం చేసిన త‌రువాత ఒక గంట విరామం ఇచ్చి ఒక అర‌టి పండును తినాలి. దీంతో పొట్ట‌లో ఉండే గ్యాస్ మొత్తం పోతుంది. పొట్ట తేలిగ్గా మారుతుంది. దీంతోపాటు ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.
5 Effective Home Remedies for Gas Problem
గ్యాస్ స‌మ‌స్య‌కు పుచ్చ‌కాయ‌లు కూడా చ‌క్క‌ని ప‌రిష్కారం.. వీటిల్లో అధిక శాతం నీరు, ఫైబ‌ర్ ఉంటాయి. క‌నుక భోజ‌నం చేసిన త‌రువాత పుచ్చ‌కాయ ముక్క‌ల‌ను ఒక క‌ప్పు తిన్నా చాలు.. వెంట‌నే గ్యాస్ ట్ర‌బుల్ నుంచి విముక్తి ల‌భిస్తుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఉండ‌దు.
కివీ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఫైబ‌ర్‌, పొటాషియం వంటి పోష‌కాలు కూడా వీటిల్లో ఎక్కువ‌గానే ఉంటాయి. అందువ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య నుంచి ఇవి రిలీఫ్ ను అందిస్తాయి. భోజ‌నం అనంత‌రం ఒక కివీ పండును తిన‌డం వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
అంజీర్ పండ్ల‌లోనూ పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఫైబ‌ర్ అంజీర్‌ పండల్లోనే అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్ స‌మ‌స్యను త‌గ్గిస్తుంది. రాత్రి భోజ‌నం చేశాక లేదా ఉద‌యం ప‌ర‌గ‌డుపునే 3-4 అంజీర్ పండ్ల‌ను తినాలి. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు ఏవీ ఉండ‌వు. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అజీర్ణం త‌గ్గుతాయి.
పుచ్చ‌కాయ‌ల‌లాగే కీర‌దోస కూడా గ్యాస్‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. వీటిలోనూ నీరు అధికంగా ఉంటుంది. క‌నుక గ్యాస్ సుల‌భంగా త‌గ్గిపోతుంది. పొట్ట ఉబ్బ‌రంగా ఉండ‌దు. తేలిగ్గా మారుతుంది.
స్ట్రాబెర్రీల‌లో ఫైబ‌ర్‌, పొటాషియం, విట‌మిన్ సి, ఐర‌న్‌, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల భోజ‌నం అనంత‌రం వీటిని తింటే గ్యాస్ రాకుండా ఉంటుంది. ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌వు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.