Health : థైరాయిడ్‌ సమస్య మగవారి సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందా..?

Health : థైరాయిడ్‌ కారణంగా..పిల్లలు పుట్టడం కష్టం అనేది అందరికి తెలిసి విషయం.. ముఖ్యంగా ఆడవాళ్లకు థైరాయిడ్‌ ఉంటే సంతానం కలగడం కాస్త కష్టం అంటారు.. అదే మగవారికి ఉన్నా.. ఇదే సమస్య ఎదురువుతుందా..?

Health : థైరాయిడ్‌ సమస్య మగవారి సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందా..?


Health : థైరాయిడ్‌ కారణంగా..పిల్లలు పుట్టడం కష్టం అనేది అందరికి తెలిసి విషయం.. ముఖ్యంగా ఆడవాళ్లకు థైరాయిడ్‌ ఉంటే సంతానం కలగడం కాస్త కష్టం అంటారు.. అదే మగవారికి ఉన్నా.. ఇదే సమస్య ఎదురువుతుందా..? అనేది చాలా మందికి తెలియదు. థైరాయిడ్ కారణంగా మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

థైరాయిడ్ గ్రంథి శరీరంలో జీవక్రియను నియంత్రించడం, ఇతర విధులను నిర్వర్తించడంలో అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సమస్య వస్తే అది మగవారి సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లు విడుదలైనప్పుడు గొనాడోట్రోపిన్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. ఇది టెస్టిస్ పనితీరును, వీర్య కణాల నాణ్యతను దెబ్బతీస్తుంది.. స్పెర్మ్‌లో అసాధారణతలు కూడా తక్కువ స్థాయిలో థైరాయిడ్ హార్మోన్‌ విడుదలవడంతో సంబంధం ఉందని వైద్యులు అంటున్నారు.

వీర్యం నాణ్యత, వీర్య కణాల సంఖ్య, స్పెర్మ్ డెన్సిటీ తగ్గడం వంటివన్నీ మగవారిలో హైపర్‌థైరాయిడిజమ్ లేదా హైపోథైరాయిడిజం వల్లేనే జరుగుతాయట.. మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తనిఖీ చేసే పారామీటర్లలో సెమెన్ పరిమాణం ఒకటి. థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఇక హైపోథైరాయిడ్ ఉన్న మగవారిలో టెస్టోస్టెరోన్, వీర్య ఉత్పత్తి తగ్గుతుంది. మగవారిలో ఫర్టిలిటీ సమస్యలు ఉన్నప్పుడు థైరాయిడ్ పనితీరును కూడా పరీక్షించడం చాలా ముఖ్యం. 
మగవారిలో థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయనప్పుడు దీనికి తగిన ఔషధాలు వాడాల్సి ఉంటుంది. హార్మోన్ లెవెల్స్ సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.

హైపోథైరాయిడిజంతో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం..

థైరాయిడ్ గ్రంథి తన విధులను చురుగ్గా నిర్వర్తించలేకపోవడం. అంటే హార్మోన్ల విడుదల తక్కువగా ఉండడాన్నే.. హైపోథైరాయిడిజం అంటారు.. ఈ సమస్య ఉన్న మగవారిలో కనిపించే లక్షణాల్లో ప్రధానమైనవి జీవక్రియ మందగించడం, అలసట, బరువు పెరగడం. మగవారిలో హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి. స్పెర్మ్ వాల్యూమ్ తగ్గుతుంది. మొటిలిటీ(కదలిక) తగ్గుతుంది. స్పెర్మ్ ఆరోగ్యంగా ఉండదు. లిబిడో తగ్గుతుంది. అంగస్తంభన సమస్యలు ఏర్పడుతాయి. మగవారి సంతానోత్పత్తి సామర్థ్యానికి అవసరమైన టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల విడుదల తగ్గుతంది.
హైపర్ థైరాయిడిజంతో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం..
థైరాయిడ్ గ్లాండ్‌ అవసరానికి మించి చురుగ్గా పనిచేయడం వల్ల వచ్చే సమస్య ఇది. బరువు తగ్గడం, చెమట పట్టడం, గుండె దడ వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు దానికి గల కారణాలు కనుక్కునే ప్రయత్నం చేయాలి. థైరాయిడ్ ట్యూమర్లు, హాషిమోటోస్ థైరాయిడైటిస్ అనే రెండు కారణాలను వైద్యులు అనుమానిస్తాయి. హైపర్ థైరాయిడిజమ్‌ను థైరాయిడ్ అబ్లేషన్ థెరపీతో నయం చేస్తారు.
‘హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండూ స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. అయితే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యానికి థైరాయిడ్ సమస్య ఒక అసాధారణ కారణమే. అనుమానాస్పద లక్షణాలు ఉన్నప్పుడు థైరాయిడ్ టెస్టులు చేయించుకోవడం మంచిది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.