కోపం ఎక్కువగా వస్తుందా.. అయితే ఈ ఆహారం తీసుకోవాల్సిందే!

కోపం శుత్రువులను పెంచడమే కాదు.. స్నేహితులను, కుంటుంబ సభ్యులను దూరం చేస్తుంది. కొపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

కోపం ఎక్కువగా వస్తుందా.. అయితే ఈ ఆహారం తీసుకోవాల్సిందే!
Food that Help in anger control


చాలామందికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది చీటికిమాటికి చిరాకు పడుతూ ఉంటారు ప్రతి విషయానికి చెప్పలేనంత కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎదుటివారిపైనా అరిచేస్తూ ఉంటారు ముఖ్యంగా కొంతమందిలో కారణం లేకుండానే విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది అయితే కోపాన్ని నియంత్రించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని ఆహార పదార్థాలు సైతం శరీరంలో రక్తపోటును అదుపులో ఉంచి బీపీ ను తగ్గిస్తాయని తెలుస్తోంది.

కోపం శుత్రువులను పెంచడమే కాదు.. స్నేహితులను, కుంటుంబ సభ్యులను దూరం చేస్తుంది. కొపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే మీ డైట్ లో కచ్చితంగా కొన్ని ఆహారపదార్థాలు చేర్చుకుంటే కోపం ఇట్టే కంట్రోల్ అయిపోతుందంట 

అరటిపండు..

అరటిపండులో విటమిన్‌ ఏ, బి, సి, బి6, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మీ శరీరాన్ని రిలాక్స్‌ చేస్తాయి. డోపమైన్‌ వంటి హ్యాపీ హార్మోను యాక్టివ్‌ చేస్తాయి. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి.. కోపాన్ని తగ్గిస్తుంది.

పసుపు..

కోపం ఎక్కువగా ఉన్నవారు వారి డైట్‌లో పసుపు చేర్చుకుంటే.. మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలుస్తోంది. పసుపులో కర్కుమిన్‌ ఉంటుంది. దీనికి యాంటీఇన్‌ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కర్కుమిన్‌ మన శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ వంటి 'ఫీల్-గుడ్' హార్మోన్లను ప్రేరేపిస్తుంది. 

బాదం..

డ్రై ఫ్రూట్స్ లో బాదం ప్రత్యేకతే వేరు ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంత మేలు చేస్తాయని సంగతి తెలిసిందే ముఖ్యంగా ఇందులో విటమిన్ ఈ తో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇవి కండరాలు నరాల కు ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా శరీరంలో కోపాన్ని సైతం తగ్గిస్తాయని భావోద్వేగాలని నియంత్రిస్తుందని తెలుస్తోంది.

అవిసె గింజలు..

శరీరానికి జుట్టుకు ఎంతో మేలు చేసే అవిస గింజలు కోపాన్ని సైతం నియంత్రిస్తాయని తెలుస్తోంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఆల్ఫా-లినోలెయిక్ యాసిడ్‌ను మెండుగా ఉంటాయి. అవిసె గింజలు కోపాన్ని కంట్రోల్‌ చేసే సూపర్‌ఫుడ్‌‌గా పనిచేస్తుంది. 

గుమ్మడి గింజలు..

ఎన్నో పోషకాలు ఉండే గుమ్మడి గింజల్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. ఇది మెగ్నీషియం స్టోర్‌ హౌస్‌. గుమ్మడిగింజలు హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. 

కివి పండ్లు..

కివీ పండులో

అధికంగా ఉంటుంది. విటమిన్‌ సి శక్తీవంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. ఏది అవసరమో దాన్ని బట్టి ఇది ప్రో-ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది! ఇది మానసిక ప్రశాంతంతను మెరుగుపరుస్తుంది.

ఆకుకూరలు, తాజా కాయగూరలు..

ఆకు పచ్చని ఆకుకూరలు శరీరానికి చేసే మేలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇందులో ఉండే పోషకాలు రక్తహీనతను దూరం చేయడమే కాకుండా శరీరాన్ని బలంగా మారుస్తాయి అంతేకాకుండా భావోద్వేగాలను సైతం అదుపులో ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.