పాలకూర గురించి ఈ విషయాలు తెలిస్తే చికెన్‌, మటన్‌ పక్కనపెడారు..!

ఆకు కూరల్లో పాలకూర కాడా ఒకటి. దీన్ని అందరూ ఇష్టంగానే తింటారు, పాలక్‌పన్నీర్‌, పాలకూర పప్పు, ఫ్రై ఇలా ఏం చేసినా రుచి అదిరిపోతుంది.

పాలకూర గురించి ఈ విషయాలు తెలిస్తే చికెన్‌, మటన్‌ పక్కనపెడారు..!
Health benefits of spinach


ఆకుకూరలు అన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి, డైలీ భోజనంలో ఏదో ఒక ఆకుకూరను తింటుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు, చాలా రోగాలను అదుపులో ఉంచుకోవచ్చు అని వైద్యులు అంటారు. ఆకు కూరల్లో పాలకూర కాడా ఒకటి. దీన్ని అందరూ ఇష్టంగానే తింటారు, పాలక్‌పన్నీర్‌, పాలకూర పప్పు, ఫ్రై ఇలా ఏం చేసినా రుచి అదిరిపోతుంది. ప్ర‌తిరోజూ క‌నీసం 100 గ్రాముల పాల‌కూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. పాల‌కూర‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. దీనిలో విట‌మిన్ ఏ, విట‌మిన్ సీ, విట‌మిన్ కె1, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, ఐర‌న్‌తో పాటు 91 శాతం నీరే ఉంటుంది. ఇది శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 

పాలకూర వల్ల కలిగే ప్రయోజనాలు

  1. పాల‌కూర‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. దీనిలో ఎక్కువ‌గా నీరు, ఫైబ‌ర్ ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌రచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.
  2. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. మెటాబాలిజం రేటు పెరుగుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా పాల‌కూర మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 
  3. పాల‌కూర‌ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. దీనిలో అధికంగా ఉండే నైట్రేట్స్ ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌రిచి ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి.
    పాలకూరలో ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌పడుతుంది.
  4. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మం బిగుతుగా త‌యార‌వుతుంది.
  5. పాల‌కూర‌లో యాంటీ స్ట్రెస్, యాంటీ డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు కూడా ఉన్నాయ‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.
  6. వ‌య‌సు పైబ‌డే కొద్ది చాలా మందికి ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. చాలా మంది నొప్పుల కార‌ణంగా స‌రిగ్గా న‌డ‌వ‌లేకపోతూ ఉంటారు కూడా. ఇటువంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉండాలంటే పాల‌కూర‌ను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుకూరలో ఉండే క్యాల్షియం, విట‌మిన్ కె ఎముక‌ల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.
  7. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది. కంటి సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న ద‌రిచేర‌కుండా ఉంటాయి. ఈ విధంగా పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియజేస్తున్నారు. 

ఎప్పుడో ఒకసారి తింటే ఈ ప్రయోజనాలు అన్నీ వచ్చేయవు. రోజు కనీసం 100 గ్రాముల చొప్పున, లేదా రెండు మూడు రోజులకు ఒకసారి తింటుంటేనే మనకు పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.