రాగి అంబలి ఈ సమ్మర్‌లో తాగాల్సిందే..! ఇలా చేసేయండి..!

అంబలి గురించి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు.. ఇప్పటికీ వారినికి. ఒక్కసారి అయినా.. ఇళ్లల్లో చేసుకుంటారు.. ఇక ఆంధ్రాలో అయితే అంబలి, జావ తాగావాళ్లు తక్కువగానే ఉంటారు..

రాగి అంబలి ఈ సమ్మర్‌లో తాగాల్సిందే..! ఇలా చేసేయండి..!


అంబలి గురించి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు.. ఇప్పటికీ వారినికి. ఒక్కసారి అయినా.. ఇళ్లల్లో చేసుకుంటారు.. ఇక ఆంధ్రాలో అయితే అంబలి, జావ తాగావాళ్లు తక్కువగానే ఉంటారు.. రాయలసీమ ప్రాంతాల్లోనే వీటిని ఎక్కువగా తాగుతుంటారు. అంబలి వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. మీరు అస్సలు వదిలిపెట్టరు తెలుసా..? సమ్మర్‌లో అంబలి తాగితే శరీరానికి ఎంత మంచిదో.. చలవ చేస్తుంది.. వడదెబ్బ ఉండదు..

రాగి అంబలి ఒక ఆరోగ్యకరమైన వంటకం. ఇది రాగుల నుండి తయారవుతుంది. మీరు ఆరోగ్య ఉండేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉదయం అల్పాహారంగా దీన్ని తీసుకోవచ్చు. రాగుల్లో ఫైబర్, ప్రొటీన్లు, కాల్షియం, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు..రాగులు అధిక మొత్తంలో ఉండే డైటరీ ఫైబర్ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇంకెందులు లేట్‌ అసలు రాగి అంబలి ఎలా చేయాలో చూద్దామా..!

రాగుల‌ను కొంత ప‌రిమాణంలో తీసుకుని వాటిని కొన్ని గంట‌ల పాటు నీటిలో నాన‌బెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా ఎండబెట్టుకోవాలి. అనంతరం తర్వాత పొడి చేయాలి. మెుదట ఒక గిన్నెలో నీళ్లు పోయాలి. రాగిపిండి కలిపి ఉండల్లేకుండా చేయాలి. అందులోనే బియ్యంపిండి, సజ్జపిండి, జొన్నపిండి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత బాగా వేడి అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో వేయండి.. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉడికించాలి. కొంచెం చిక్కగా మారిన తర్వాత.. స్టౌవ్ ఆఫ్ చేయండి. ఉదయం పూట తీసుకుంటే చాలా బలంగా తయారవుతారు. వేసవిలో కడుపులో చల్లగా ఉంటుంది.

అంబలి తీసుకుంటే.. ఎండవల్ల వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఐరన్, ఫైబర్, ఖనిజాలు, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఇది చాలా మంచిది.. రాగి అంబలితో శరీరానికి చాలా బలం. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.