computer users : కంప్యూటర్ వాడుతున్నారా.. ఈ విషయాలన్నీ మీకోసమే.. మరిచిపోతే పెను ప్రమాదం తప్పదు

నిత్యం computer వాడటం వల్ల ముఖ్యంగా ప్రభావం చూపించే భాగం కళ్ళు. కళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోయి అక్కడ ఉండే కండరాలు, ఎముకలు తీవ్రంగా ఒత్తిడికి గురవుతాయి. ఈ సమయంలోనే కంటికి సంబంధించిన పలు సమస్యలు ఎదురయిపోయి సవాలుగా మారుతాయి.

computer users : కంప్యూటర్ వాడుతున్నారా.. ఈ విషయాలన్నీ మీకోసమే.. మరిచిపోతే పెను ప్రమాదం తప్పదు
Health issues for computer users


Risk with computer : ఈ రోజుల్లో చిన్న వయసు నుంచే computer వాడాల్సిన అవసరం వచ్చేస్తుంది. ఉరుకులు పరుగులు పెడుతున్న ఈ ప్రపంచంలో పాటు మనం కూడా పరిగెత్తకపోతే అవ్వని పరిస్థితి నుంచి కంప్యూటర్ను వాడటం అలవాటు చేసేస్తున్నారు. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి అనే విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
ప్రతి రంగంలోనూ కంప్యూటర్ ప్రాధాన్యత తప్పనిసరి. పనిచేస్తున్న.. చదువుకుంటున్న.. చివరికి ఆటల్లో సైతం కంప్యూటర్ నేను ఉన్నాను అంటూ గుర్తు చేస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరి ఇంటిలో కంప్యూటర్ ఉంటూనే ఉంటుంది. అయితే ఈ కంప్యూటర్ వాడకం శరీరాన్ని ఎంతగా గుల్ల చేస్తుందో చాలామందికి తెలియదు.
నిత్యం కంప్యూటర్ వాడటం వల్ల ముఖ్యంగా ప్రభావం చూపించే భాగం కళ్ళు. కళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోయి అక్కడ ఉండే కండరాలు, ఎముకలు తీవ్రంగా ఒత్తిడికి గురవుతాయి. ఈ సమయంలోనే కంటికి సంబంధించిన పలు సమస్యలు ఎదురయిపోయి సవాలుగా మారుతాయి.
నెమ్మదిగా కంటిచూపు తగ్గిపోవడం, కళ్ళు ఎర్రబడటం, కళ్ళ నుండి నీరు కారటం, కంటిలో వాపులు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే కంప్యూటర్ వాడినప్పుడు ఖచ్చితంగా కళ్లద్దాలు ఉపయోగించాలి.
అలాగే ఎక్కువగా కంప్యూటర్ వాడితే నడుము నొప్పి, మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు కాళ్లు, చేతులు, భుజాలు నొప్పులు మొదలవుతాయి.

కంప్యూటర్ వాడినప్పుడు చేసే తప్పులు..

కంప్యూటర్ వాడినప్పుడు కొన్ని తప్పులు కచ్చితంగా చేయకూడదు. అందులో ముఖ్యంగా ఒకే స్థితిలో చాలాసేపు కదలకుండా కూర్చోవడం, కంప్యూటర్ ముందు కూర్చుని సోఫా కుర్చీలు సరైన ఎత్తులో ఉండకపోవడం, మంచాలపై ఎగుడు దిగుడుగా కూర్చుని పని చేయటం, కళ్ళు వెడల్పుగా చేసుకొని పనిచేయటం వంటివి అసలు చేయకూడదు..

ఎక్కువగా వాడితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే..

అలాగే కంప్యూటర్ ని ఎక్కువగా వాడుతున్నప్పుడు ఎక్కడలేని నడుము నొప్పి వస్తుంది. అలాగే శరీరంలో తిమ్మిర్లు ఎదురవుతాయి. నుదురు భాగంలో విపరీతంగా నొప్పి వస్తువులతో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. కళ్ళు పూర్తిగా అలసటకి గురవుతాయి. సంసార సుఖాన్ని సైతం ఇష్టపడక ఆసక్తి తగ్గిపోతుంది.

కొంతైనా ఎలా బయటపడాలి అంటే..

ఈ కాలంలో పూర్తిగా కంప్యూటర్ను వాడటం మానేయడం జరగని పని. అందుకే కంప్యూటర్ వాడుతున్నప్పుడు కచ్చితంగా కళ్లద్దాలు వాడాలి. ఎక్కువసేపు కూర్చోవలసి వస్తే వంగి కూర్చోకూడదు. సరైన ఎత్తు ఉన్న కుర్చీని తీసుకోవాలి. అరగంటకు ఒకసారి అయినా కంప్యూటర్ ముందు నుంచి లేచి అటు ఇటు నడవటం అలవాటు చేసుకోవాలి. కాళ్లకు రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి కాళ్ళ కింద సరైన ఎత్తును ఉంచుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.