అధిక వ్యాయామంతో గుండెపోటు..  నిపుణులు ఏమంటున్నారు.. !

వ్యాయామాన్ని నిత్యజీవితంలో ఓ భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. అధిక వ్యాయామం చేయటం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి Heart attack వ‌చ్చే ప‌రిస్థితులు త‌లెత్త‌వ‌చ్చు.

అధిక వ్యాయామంతో గుండెపోటు..  నిపుణులు ఏమంటున్నారు.. !
Heart attack Risks Associated With Extreme Exercise


వ్యాయామాన్ని నిత్యజీవితంలో ఓ భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. అయితే అధిక వ్యాయామం శరీరానికి మంచిది కాదని దీని వలన ఎన్నో రకాల సమస్యలు వస్తాయని పలు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాం.. 

అధిక వ్యాయామం చేయటం వల్ల శరీరానికి హాని జరుగుతుంది.. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని అంటూ ఉంటారు.. ఇటీవ‌లి కాలంలో జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేస్తూ కుప్ప‌కూలిన దాఖ‌లాలు చాల‌నే ఉన్నాయి. ప్ర‌ముఖ న‌టుడు పునీత్ రాజ్ కుమార్ కూడా వ్యాయామం చేస్తూనే మృత్యువాత ప‌డ్డారు.  అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌య‌త్ అన్న‌ట్లు.. మొతాదు మించి ఏది చేసినా అది అన‌ర్థ‌మే. వ్యాయామం చెయ్య‌డం వ‌ల్ల ఆరోగ్యంగా బాగుంటుంది. బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజ్‌లు, వాకింగ్‌, జిమ్ చెయ్య‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ప‌నిచేస్తుంది. అయితే రోజులో ఎంతసేపు వ్యాయామం చేస్తే మంచిదనే విషయం చాలామందికి తెలియదు.. 

ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడి చనిపోతూ ఉండటం ఈ కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. వీరిలో ముఖ్యంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ఒక్కోసారి వ్యాయామం చేస్తూనే కుప్పకూలిపోవడం గుండెపోటుతో మరణించడం వల్ల వ్యాయామం వల్లే పలు సమస్యలు తలెత్తుతున్నాయని ఆలోచన బలంగా నమ్ముతున్నారు.

అయితే కేవలం వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం లేదని వైద్యులు నిర్ధారించారు అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వ్యాయామం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థాయికి మించి శరీరాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని, వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని తెలిపారు.. రోజులో కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే చాలు ఇది కూడా వారంలో ఒక ఐదు రోజులు పాటు చేయాలి అని తెలిపారు.

ప్రాణాయామం, ఆసనాలు వంటి కూర్చొని చేసే శ్వాసకు వ్యాయామాలు గుండె ఆరోగ్యంపై చాలా తక్కువ ప్రభావం చూపిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంచుకొని, కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో ఉంచుకోవాలంటే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి ఉత్తమం. అధిక వ్యాయామాలు, ఒకేసారి ఎక్కువగా బరువులు ఎత్తడం వంటివీ అంతగా గుండెకు మంచివి కావు. కొత్తగా వ్యాయామాన్ని ప్రారంభించాలి అనుకునే వారు మాత్రం చిన్న చిన్న ఎక్సర్సైజులతో మొదలు పెట్టడం మంచిది. అలాగే శ‌రీరంలో ట్రైగ్లిజ‌రైడ్స్ పెర‌గ‌డం వ‌ల్ల గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. ట్రైగ్లిజపోరైడ్స్‌ అంటే ఏంటి..? Triglycerides తో గుండెకు ముప్పు

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.