In vitro fertilization : సంతానం లేని వారికి IVF అవసరమేనా..? దీనివల్ల పిల్లలు పుడతారా..?

In vitro fertilization : సంతానం లేని వారికి సంతానం కలిగేలా చేసే వివిధ రకాల వైద్యవిధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ సృష్టిలో ప్రతిజీవి అద్భుతం, ప్రతి పుట్టుక అద్వితీయం. అయితే సృష్టికి ప్రతిసృష్టిలా మానవుడి మేధోశక్తి

In vitro fertilization : సంతానం లేని వారికి IVF అవసరమేనా..? దీనివల్ల పిల్లలు పుడతారా..?


In vitro fertilization : సంతానం లేని వారికి సంతానం కలిగేలా చేసే వివిధ రకాల వైద్యవిధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ సృష్టిలో ప్రతిజీవి అద్భుతం, ప్రతి పుట్టుక అద్వితీయం. అయితే సృష్టికి ప్రతిసృష్టిలా మానవుడి మేధోశక్తి ఎన్నో అద్భుతాలను సృష్టించింది. ఇందులో వైద్య రంగంలో వంధ్యత్వానికి చికిత్స చేయడం ఈ యుగంలో గొప్ప పురోగతిగా పరిగణించవచ్చు. పూర్వం సంతానం లేని వారు తమకు జీవితంలో తల్లిదండ్రులు అయ్యే యోగం లేదని ఫిక్స్‌ అయిపోయేవాళ్లు...కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం మరింత అభివృద్ధి చెందింది. కృత్రిమంగా గర్భధారణ చేసే వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
IVF ద్వారా సంతానం లేనివారు ఎంతోమంది తల్లిదండ్రులు అయ్యారు..కానీ ఈ చికిత్స ఎంతవరకు కరెక్ట్‌..? IVF ద్వారా నిజంగా పిల్లలు పుడతారా..?
Why IVF Babies Delivered Early | Premature born - CandorIVF Surat
సంతానం లేని భార్యాభర్తలు IVF ద్వారా సంతానం పొందాలనుకుంటే ముందుగా IVF ప్రక్రియను అర్థం చేసుకోవాలి.. బిడ్డ జన్మించాలంటే వీర్య కణాలు అండంతో కలవాలి. అప్పుడు అది పిండంగా రూపాంతరం చెందుతుంది. ఈ విషయంలో ఇబ్బందులు ఉన్నప్పుడు IVF విధానం ద్వారా ల్యాబ్‌లో అండకణాలను సంగ్రహించటం, స్పెర్మ్ నమూనాను మెరుగుపరచడం చేస్తారు. ఇంకా సరళంగా చెప్పాలంటే ఆడవారి నుంచి అండకణాలను, మగవారి నుంచి వీర్యకణాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో ఫలదీకరణ చేయడం.

IVF ఎప్పుడు అవసరం?

అయితే సంతానం కలగని వారందరికీ IVF అవసరం లేదు. వైద్యులను సంప్రదిస్తే వారు అసలు సమస్య ఎక్కడ ఉందనేది చెప్తారు. ఆ మేరకు సహజసిద్ధంగానే గర్భం ధరించేలా తగిన చికిత్స, ఔషధాలు అందిస్తారు. ఎవరికైతే సహజ సిద్ధంగా గర్భధారణ కలగడానికి అవకాశం లేకుండా ఉంటుందో వారికి మాత్రమే చివరి ప్రత్యామ్నాయంగా IVF అవసరం అవుతుంది. ముఖ్యంగా ఆడవారిలో ఫెలోపియన్ నాళాలు మూసుకుపోయినపుడు, అండ కణాలు తక్కువగా ఉన్నప్పుడు అలాగే మగవారిలో స్పెర్మ్ నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు ఇది అవసరం అవుతుంది. సంతానం కలగటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలమైనపుడు మాత్రమే IVF మార్గాన్ని ఎంచుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.