ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన వెంటాడుతూనే ఉందా..? ఈ లోపం కావొచ్చు..

రోగనిరోధక శక్తి మనకు ఎంత అవసరం అనే దాని గురించి మూడేళ్లగా చర్చ జరుగుతూనే ఉంది.. లక్షలాది సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించి, మన శరీరంపై వేల రకాలుగా దాడి చేస్తాయి. వాటిని ముందు యుద్ధంలో వీరుడిలా

ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన వెంటాడుతూనే ఉందా..? ఈ లోపం కావొచ్చు..


రోగనిరోధక శక్తి మనకు ఎంత అవసరం అనే దాని గురించి మూడేళ్లగా చర్చ జరుగుతూనే ఉంది.. లక్షలాది సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించి, మన శరీరంపై వేల రకాలుగా దాడి చేస్తాయి. వాటిని ముందు యుద్ధంలో వీరుడిలా పోరాటం చేసేది ఇమ్యునిటీ పవర్‌.. ఎప్పుడైతే.. సైన్యం దాడిలో.. వీరుడు మరణిస్తాడో..ఇక ఆ యుద్ధం పోయినట్లే.. రాజ్యం రాక్షసుల చేతుల్లోకి పోతుంది..సేమ్‌ ఇదే మన శరీరంలోనూ జరుగుతుంది.. మనపై దాడి చేయాలని వచ్చిన లక్షలాది వైరస్‌లను ఇమ్యునిటీ పవర్‌ నాశనం చేస్తుంది. అయితే ఏ మనిషిలో అయితే రోగనిరోధక శక్తి తగ్గడం ప్రారంభమవుతుందో.. అనేక వ్యాధులు వస్తాయి. తరచుగా జలుబు, జ్వరం, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. బాడీలో ఇమ్యునిటీ పవర్‌ తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ముందు మనకు తెలిసి ఉండాలి..!

How does stress affect mental health and how to avoid it | HealthShots

 బలహీనమైన రోగనిరోధక శక్తి సంకేతాలు

మీకు తరచుగా జలుబు మరియు ఫ్లూ వస్తుంటే, మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని అర్థం చేసుకోండి.

గాయం త్వరగా మానకపోతే, అది మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటే మీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లే.. 

చెవిలో ఇన్ఫెక్షన్, దురద కూడా బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతం.

మీరు తరచుగా కడుపు నొప్పిని కలిగి ఉంటే లేదా మీ కడుపు బాగా లేకుంటే, మీ రోగనిరోధక శక్తి బలహీనంగా మారింది.

తరచూ ఒత్తిడిని అనుభవిస్తున్నా.. లేదా చాలా కాలంగా ఒత్తిడిని తీసుకుంటే, అది మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.