మూత్రాన్ని అధిమి పడుతున్నారా.. ఈ ప్రమాదాలు తప్పదు..

Urine అదుపు చేయడం వల్ల పెను ప్రమాదాలు తప్పవు అంటున్నారు నిపుణులు.. గంటల తరబడి Urine ఆపటం ఎంత మాత్రం సరికాదని శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించాల్సిందే అని తెలుస్తోంది

మూత్రాన్ని అధిమి పడుతున్నారా.. ఈ ప్రమాదాలు తప్పదు..
Risk with controlling urine


contolling urine : చాలామంది urine అధిమి పడుతుంటారు.. ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో అసౌకర్యంగా అనిపిస్తుందని. ఎక్కువగా బయట మాత్రం వాడటానికి ఇష్టపడరు అయితే ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుస్తోంది.. 

మూతాన్ని అదుపు చేయడం వల్ల పెను ప్రమాదాలు తప్పవు అంటున్నారు నిపుణులు.. గంటల తరబడి మూత్రాన్ని ఆపటం ఎంత మాత్రం సరికాదని శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించాల్సిందే అని తెలుస్తోంది ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన మూత్రనాలు ఇన్ఫెక్షన్ తో పాటు పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

 

మూత్రాన్ని ఎక్కువసేపు అదుపు చేయడం వల్ల మూత్రాశయం దగ్గర మంట పుడుతుంది.. ఎలాంటి వారైనా మూత్రాన్ని 20 సెకండ్ల లోగానే పూర్తి చేసుకోవాలి. అలా కాకుండా అంతకు మించిన సమయం పడుతూ ఉంటే కచ్చితంగా ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమో తెలుసుకోవాలి. తరచూ మూత్రాన్ని ఆపే అలవాటు ఉన్న వాళ్ళలో కచ్చితంగా మూత్రనాల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.. 

అలాగే ఈ అలవాటును మార్చుకోకుండా కొనసాగిస్తే...

కిడ్నీల్లో రాళ్లు, పిత్తాశయంలో వాపు, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఎవరికైనా మూత్రం ఆలస్యంగా వస్తున్నట్లయితే, మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఇలాంటివారు రోజు తప్పనిసరిగా ఆరు నుంచి పది గ్లాసులు నీరు మాత్రం తీసుకోవాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.