Eyesight : కంటి చూపు మెరుగుపడాలంటే ఈ చిట్కాలను ట్రై చేయండి..!

Eyesight : మన శరీర అవయవాల్లో..అతి ముఖ్యమైనవి.. ఇవి అందాన్ని, ఆరోగ్యాన్ని రెండింటిని డామినేట్‌ చేస్తాయి. కళ్లు సరిగ్గా లేకపోతే.. ఏదీ చూడలేం.. ఉద్యోగాలు చేసేవాళ్లకు అయితే ఇక నరకమే.. కొంతమంది కళ్లు ఎర్రగా మారి ఇబ్బంది పడతారు. పొడిబారడం, కళ్లలోంచి నీళ్లు రావడం జరుగుతుంది.

Eyesight : కంటి చూపు మెరుగుపడాలంటే ఈ చిట్కాలను ట్రై చేయండి..!
Try these tips to improve eyesight


Eyesight : మన శరీర అవయవాల్లో..అతి ముఖ్యమైనవి.. ఇవి అందాన్ని, ఆరోగ్యాన్ని రెండింటిని డామినేట్‌ చేస్తాయి. కళ్లు సరిగ్గా లేకపోతే.. ఏదీ చూడలేం.. ఉద్యోగాలు చేసేవాళ్లకు అయితే ఇక నరకమే.. కొంతమంది కళ్లు ఎర్రగా మారి ఇబ్బంది పడతారు. పొడిబారడం, కళ్లలోంచి నీళ్లు రావడం జరుగుతుంది. కొన్ని ర‌కాల చిట్కాల‌ను వాడి మ‌నం కళ్ల‌ల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొల‌గించుకోవ‌చ్చు.

ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల క‌ళ్లు శుభ్ర‌ప‌డ‌డంతో పాటు కంటి చూపు కూడా మెరుగుప‌డుతుంది. క‌ళ్ల ఆరోగ్యం మెరుగుప‌డి కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. క‌ళ్ల‌ను శుభ్ర‌ప‌రిచి కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో రోజ్ వాట‌ర్ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ రాత్రి ప‌డుకునే ముందు క‌ళ్ల‌ల్లో రెండు లేదా మూడు చుక్క‌ల రోజ్ వాట‌ర్‌ను వేసుకుని ప‌డుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 

క‌ళ్ల‌ను చ‌ల్ల‌గా ఉంచి కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో మ‌న‌కు కీర‌దోస ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. కీర‌దోస ముక్క‌ల‌ను 15 నిమిషాల పాటు కళ్ల‌పై ఉంచుకోవ‌డం వ‌ల్ల క‌ళ్లు చల్ల‌బ‌డ‌తాయి. అలాగే ఎర్ర‌బ‌డిన క‌ళ్లు కూడా తెల్ల‌గా మార‌తాయి. క‌ళ్ల‌పై కీర‌దోస ముక్క‌ల‌ను ఉంచుకోవ‌డం వ‌ల్ల క‌ళ్ల ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు క‌ళ్ల చుట్టూ ఉండే న‌ల్ల‌టి వ‌ల‌యాలు కూడా త‌గ్గుతాయి.

క్ర‌మం త‌ప్ప‌కుండా కీర‌దోస ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల క‌ళ్ల ఆరోగ్యం మెరుగుప‌డి కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. క‌ళ్ల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంలో పాలు కూడా మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. 

చ‌ల్ల‌టి పాలల్లో దూదిని ముంచి క‌ళ్ల‌పై 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. త‌రువాత క‌ళ్ల‌ను నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల‌ల్లో ఉండే దుమ్ము, ధూళి తొల‌గిపోతుంది. క‌ళ్ల వాపులు త‌గ్గుతాయి. 

తేనెను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా మ‌నం మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. క‌ళ్ల‌ల్లో రెండు లేదా మూడు చుక్క‌ల తేనెను వేసుకోవాలి. దీనిని ప‌ది నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు శుభ్ర‌ప‌డ‌తాయి. క‌ళ్ల ఎరుపుద‌నం త‌గ్గుతుంది.  

కీర దోస‌ను జ్యూస్‌గా చేసి ఐస్ ట్రేలో వేసి ఫ్రిజ్ లో ఉంచాలి. కీర‌దోస జ్యూస్ ఐస్ క్యూబ్స్‌లా మారిన త‌రువాత వాటిని క‌ళ్ల‌పై ఉంచి మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు చ‌ల్ల‌బ‌డ‌తాయి. క‌ల్ల‌పై ఒత్తిడి త‌గ్గుతుంది. కంటికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ చ‌క్క‌గా జ‌రుగుతుంది. దీని వ‌ల్ల చ‌క్క‌టి నిద్ర ప‌డుతుంది. 

ఈ చిట్కాల‌ను పాటిస్తూనే ప్ర‌తిరోజూ చ‌క్క‌గా నిద్ర‌పోవాలి. క‌ళ్ల‌కు వీలైనంత ఎక్కువ‌గా విశ్రాంతిని ఇవ్వాలి. ఈ విధంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం కంటి స‌మ‌స్య‌ల‌ను చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డ‌డంతో పాటు క‌ళ్లు కూడా శుభ్ర‌ప‌డ‌తాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.