Tests for infertility problems : సంతానలేమి సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి..?

Infertility : ఈరోజుల్లో అస్థవ్యస్థమైన జీవనశైలి వల్ల.. పిల్లలు పుట్టడం చాలామందికి కష్టంగా ఉంటోంది. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడుతున్నాయి. వంధ్యత్వానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు మహిళలు మాత్రమే ఉంటుందని అనుకుంటుంటారు.

Tests for infertility problems : సంతానలేమి సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి..?
Tests for infertility problems


Tests for infertility : ఈరోజుల్లో అస్థవ్యస్థమైన జీవనశైలి వల్ల.. పిల్లలు పుట్టడం చాలామందికి కష్టంగా ఉంటోంది. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడుతున్నాయి. వంధ్యత్వానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు మహిళలు మాత్రమే ఉంటుందని అనుకుంటుంటారు. కానీ పురుషులలో సంతానలేమి సమస్యలు ఎక్కువగా ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి . అదుపు తప్పిన జీవనశైలి కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
వృషణాలు దెబ్బతినడం, అంగస్తంభన సమస్య ఉన్నవారు కచ్చితంగా ఫెర్టిలిటీ టెస్ట్ చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనితో పాటు, క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నవారు లేదా మూత్ర నాళ శస్త్రచికిత్స చేయించుకున్నవారు తప్పనిసరిగా సంతానోత్పత్తి పరీక్షను కూడా చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే మగవారికి సంతానలేమి సమస్య ఉందో లేదో తెలుసుకునే అనేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. 

సంతానలేమి సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి..?

  • మెడికల్ హిస్టరీ అసెస్‌మెంట్ -

పురుషులు వంధ్యత్వానికి సంబంధించిన సమస్యకు గల కారణాలు, అనారోగ్యం, శస్త్రచికిత్స వంటి సమస్యల గురించి వైద్యులు పరీక్షిస్తారు. ఇది కాకుండా, మెడికల్ హిస్టరీ అధారంగా జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో పలు సూచనలను వివరిస్తారు. ఈ సూచనలను పాటించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడవచ్చు.
  • సెమెన్ అనాలిసిస్ -

సెమెన్ అనాలిసిస్ ద్వారా పురుషుల స్పెర్మ్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. వీర్యం పరీక్ష మూడు విధాలుగా చేస్తారు. స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ సైజు, స్పెర్మ్ కదలిక ద్వారా స్పెర్మ్ సామర్థ్యాన్ని విశ్లేషిస్తారు.
  • జన్యు పరీక్ష -

వీర్యం విశ్లేషణలో స్పెర్మ్ సంఖ్య చాలా తక్కువగా ఉంటే, ఇది జన్యుపరమైన కారణాల వల్ల సంతానలేమి సమస్యను ఏర్పడవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ పరీక్ష కోసం స్పెర్మ్‌ను సేకరిస్తారు.
  • హార్మోన్ స్థాయిలు -

మన శరీరంలో స్పెర్మ్ ఉత్పత్తిని నియంత్రించే రసాయనాలను హార్మోన్ ప్రేరేపిస్తాయి. హార్మోన్లు లైంగిక కోరిక, సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అధిక లేదా తక్కువ హార్మోన్ల కారణంగా, స్పెర్మ్ ఉత్పత్తి, సెక్స్‌లో సమస్యలు ఉండవచ్చు. పునరుత్పత్తికి హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH) టెస్టోస్టెరాన్ హార్మోన్‌లను పరీక్షించడం ద్వారా వంధ్యత్వ సమస్యను గుర్తించవచ్చు. రక్త పరీక్ష ద్వారా ఈ రెండు హార్మోన్ల స్థాయిలను గుర్తిస్తారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.