Ajwain water : పరగడుపున వాము నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు..

పురాతన కాలం నుంచి భారతీయ వంటకాల్లో భాగంగా మారిపోయింది Ajwain..  ఈ Ajwain ను ఉపయోగించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు కొంచెం Ajwain తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి ఈ నీటిని రోజు తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయి..

Ajwain water : పరగడుపున వాము నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు..
Benefits of drinking Ajwain water in the morning


Ajwain water : రోజు మనకు వంట గదిలో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..  వీటిని ఉపయోగించి మనం పెద్ద ఆరోగ్య సమస్యలను కూడా చిటికెలో మాయం చేసుకోవచ్చు..  అలాంటి అద్భుత ఔషధమైన Ajwain ను రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.. 

పురాతన కాలం నుంచి భారతీయ వంటకాల్లో భాగంగా మారిపోయింది వాము..  ఈ వామును ఉపయోగించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు కొంచెం వాము తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి ఈ నీటిని రోజు తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.. అలాగే వామును నీటితో తీసుకున్నప్పుడు బరువు తగ్గడానికి మరియు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఋతుచక్ర నొప్పి, తిమ్మిరి నుండి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి.

అలాగే చనుబాలులిచ్చు తల్లులలో, పాలను మెరుగుపర్చడానికి వాము సహాయపడుతుంది. కానీ, గర్భధారణ సమయంలో దీనిని ఉపయోగించే ముందు జాగ్రత్త తీసుకోవాలి.

అంతేకాకుండా జీర్ణాశయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తీరిపోతాయి ఆహారం జీర్ణం కాని వారు మలబద్ధకం ఉన్నవాళ్లు పరగడుపున వాము నీళ్లు తీసుకోవడం వల్ల రెండు మూడు రోజుల్లోనే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు..  దగ్గు జలుబు ఆస్తమా వంటి ఎలాంటి శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్న వాము నీళ్ళు చక్కటి పరిష్కారం.. ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు వాము నీరు తరచూ తీసుకోవచ్చు అంతేకాకుండా కీళ్ల నొప్పులు కీళ్లవాతం ఉన్నవారికి కూడా ఇవి మంచి పరిష్కారంగా చెప్పవచ్చు..

శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఈ నీళ్లు సక్రమంగా పనిచేస్తాయి.. అయితే పరగడుపునే గ్లాస్ వాము నీళ్ళు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు.. అయితే వాము అనేది వేడిని పెంచే పదార్థంగానే పరిగణిస్తారు కాబట్టి అందుకు తగ్గినట్టు రోజులో ఒక రెండు గ్లాసులు మజ్జికైనా తీసుకుంటే ఏ ఇతర సమస్యలు దరి చేరవు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.