Bael fruit : మారేడు పండుతో ఏళ్లనాటి పక్షవాతాన్ని అయినా నెలలో తగ్గించుకోవచ్చు

Bael fruit  గురించి చాలా తక్కువ మందికి మాత్రమే ఐడియా ఉంటుంది. దీన్ని శివుని పూజల్లో కచ్చితంగా ఉపయోగిస్తారు. నిజంగా ఇది ఆ దేవుడినికి మాత్రమే నైవేద్యం కాదు..మనకు కూడా.. ఎంతో గొప్ప పోషకాలు ఈ పండులో ఉన్నాయి..

Bael fruit  :  మారేడు పండుతో ఏళ్లనాటి పక్షవాతాన్ని అయినా నెలలో తగ్గించుకోవచ్చు
Bael fruit


Bael fruit  గురించి చాలా తక్కువ మందికి మాత్రమే ఐడియా ఉంటుంది. దీన్ని శివుని పూజల్లో కచ్చితంగా ఉపయోగిస్తారు. నిజంగా ఇది ఆ దేవుడినికి మాత్రమే నైవేద్యం కాదు..మనకు కూడా.. ఎంతో గొప్ప పోషకాలు ఈ పండులో ఉన్నాయి.. ఎన్నో రోగాలను ఇలా చేత్తో తీసేసినట్లు తీసే శక్తి ఈ పండుకు ఉంది తెలుసా..? మారేడు పండు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మారేడు పండు మంచి విరోచనకారి. దీనిని పచ్చిగా కూడా తినవచ్చు లేదా జ్యూస్ రూపంలో తాగవచ్చు.
ఈ కాయను కట్ చేసి నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసి కూడా వాడవచ్చు. దీని ఔషధ గుణాలు, పోషకాలు తెలుసుకొని అంతర్జాతీయ పరిశోధకు సైతం ఆశ్చర్యపోయారు. మారేడు పండులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్. పైసా ఖర్చు లేకుండా ప్రకృతి మనకు మారేడు అందించే పోషకాలు ఇవి.

100 గ్రాముల మారేడు ఫలంలో ఉండే పోషకాలు..

  • కేలరీలు 88
  • ప్రోటీన్ 1.8 గ్రాములు
  • కార్బోహైడ్రేట్స్ 31.8 గ్రాములు
  • హిమోగ్లోబిన్ 1.1 గ్రాముల
  • ఫైబర్ 4.3 గ్రాములు
ఈ పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. పక్షవాతానికి మారేడు చెట్టు ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. మారేడు కాయను సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆకులను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండు ఖర్జూరాలను కూడా తెచ్చుకోవాలి.
ఎండు ఖర్జూరాలలోని విత్తనాలు తీసి ఖర్జూరాన్ని ఎండబెట్టుకోవాలి. ఎండిన మారేడు ఆకులు 100 గ్రాములు, మారేడుకాయ 100 గ్రాములు, పటికబెల్లం 100 గ్రాములు, ఖర్జూరాలు 100 గ్రాములు తీసుకోవాలి. ఈ నాలుగింటిని దంచి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాసు ఆవు పాలు వేడి చేసి అందులో స్పూన్ ఈ చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి. ఈ చూర్ణం శరీరంలో వేడిని తీసేస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. ప్రేగులను బలంగా తయారు చేస్తుంది. 
బాగా పండిన మారేడు పండు విరేచనకారిగా పని చేస్తుంది. సగం పండిన మారేడు పండు విరోచనాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జిగట విరోచనాలు అవుతున్నప్పుడు ఈ పండు తీసుకుంటే వెంటనే ఉపశమనం ఉంటుంది ఈ కాయను గుండ్రంగా కట్ చేసి నీడలో ఆరబెట్టి పొడి చేసి పెట్టుకొని వాడుకుంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి రోగాలను రాకుండా అడ్డుకుంటాయి. 
మారేడుకాయ క్యాన్సర్ కణాలను అడ్డుకోవడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్పై పోరాడి డయేరియా, కలరా వంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. మారేడు గుజ్జులా తిన్నా లేదా పండుని పొడిలా చేసుకుని వాడుకున్నా అనేక రకాల వ్యాధులను దూరంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.