కొంబుచా టీ: షుగర్‌కు ఈ డ్రింక్‌తో చెప్పండి బాయ్‌ బాయ్‌..

డయబెటీస్‌ అనేది వదలని రోగం.. దీనికి వన్‌వేనే.. రావడమే కానీ పోవడం ఉండదు. షుగర్‌ వచ్చిందంటే ముందుగా రక్తంలో గ్లూగోజ్‌ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో గ్లోగోజ్‌ స్థాయిలు పెరిగితే.. షుగర్‌ లెవల్స్‌ కూడా

కొంబుచా టీ: షుగర్‌కు ఈ డ్రింక్‌తో చెప్పండి బాయ్‌ బాయ్‌..


డయబెటీస్‌ అనేది వదలని రోగం.. దీనికి వన్‌వేనే.. రావడమే కానీ పోవడం ఉండదు. షుగర్‌ వచ్చిందంటే ముందుగా రక్తంలో గ్లూగోజ్‌ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో గ్లోగోజ్‌ స్థాయిలు పెరిగితే.. షుగర్‌ లెవల్స్‌ కూడా తగ్గుతాయి. ఇది ప్రమాదకరంగా ఉంటుంది. షుగర్‌ కంట్రోల్లో ఉండాలంటే.. గ్లూగోజ్‌ స్థాయిలు నియంత్రణలో ఉండాలి. ఇటీవల జరిపిన అధ్యయనంలో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పానియం గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. 

కొంబుచా అనే పానీయం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చని కొత్త అధ్యయానాన్ని ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. ఈ ట్రెండీ డ్రింక్ తాగిన టైప్-2 డయాబెటిస్ పేషెంట్లలో నాలుగు వారాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు తెలిపారు. ఫెర్మెంట్ చేసిన ఈ టీలో అభివృద్ధి చెందే ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఈ తాజా అధ్యయనంలో డయాబెటిస్ రోగులకు ఒక నెల పాటు కొంబుచా పానీయం తీసుకున్న వారిలో రక్తంలో గ్లూకోజ్ తక్కువగా నమోదు కావడాన్ని గమనించారు. కొంబుచా వంటి ట్రెండీ డ్రింక్‌పై జరిపిన మొదటి క్లినికల్ ట్రయల్ ఇదే. కొంబుచా ఇచ్చిన నాలుగు వారాల వ్యవధిలో ఇదే రుచితో ఉండే ప్లెసిబో కూడా ఇచ్చారట. ప్లెసిబో కంటే కొంబుచా డయాబెటీస్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించడాన్ని పరిశోధకులు గమనించారు. అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అధ్యయనకర్తలు అన్నారు.

2000 ఏళ్లనాటి పురాతన పానీయం ఇది

కొంబుచా ఇప్పటి పానియ కాదు.. 2000 సంవత్సరాలు పురాతనమైన పానీయం. ఇందులో కేవలం టీ మాత్రమే ఉండదు. ఫర్మెంట్ చేసిన కొద్దిగా ఫిజీగా ఉండే డ్రింక్ ఇది. ఇప్పుడు ఈ డ్రింక్ చాలా ప్రాచూర్యంలో ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇది దీని వ్యాపారం బిలియన్లకు చేరింది. కీస్తుపూర్వం నుంచి దీని తయారీకి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీనికి అతి పురాతన పానీయంగా గుర్తింపు కూడా ఉంది. ఇందులో టీ ఉంటుంది. అది బ్లాక్ లేదా గ్రీన్ టీ ఏదైనా కావచ్చు. చక్కెర లేదా టర్బినాడో లేదా తేనెను స్వీటెనర్‌గా వాడుతారు. పులిసేందుకు ఈస్ట్‌ను కలుపుతారు. దీన్ని తయారు చేసిన తర్వాత వారం నుంచి నెల రోజుల వరకు పులియబెడతారు. చివరగా కొద్దిగా కార్బోనెట్ అయిన పానీయం తయారవుతుంది. రుచికి కొద్దిగా వెనిగర్ మాదిరిగా పుల్లగా ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ 0.5 శాతం కంటే తక్కువే ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.