విటమిన్ ఇ తో లాభాలు ఎన్నో.. 

విటమిన్ ఇ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. దీనిని ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్యానికి, అందానికి మంచిగానే ఉపయోగపడుతుంది..

విటమిన్ ఇ తో లాభాలు ఎన్నో.. 
benefits of vitamin E


చలికాలంలో చర్మం పొడిగా మారీ..  మృదుత్వాన్ని కోల్పోతుంది.. అలాగే చూడటానికి కూడా ఇబ్బందికరంగా అనిపిస్తుంది.. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే పలు రకాల మాయిశ్చరైజర్లు ఉపయోగిస్తారు.. ఇలా కాకుండా శరీరానికి ఎంతో మేలు చేసే విటమిన్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుందని తెలుస్తోంది.. 

విటమిన్ ఇ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. దీనిని ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్యానికి, అందానికి మంచిగానే ఉపయోగపడుతుంది.. ముఖ్యంగా రాత్రులు నిద్రపోయే ముందు శరీరానికి విటమిన్ ఇ ఆయిల్ ను రాసుకొని పడుకోవడం వల్ల చలికాలంలో వచ్చే సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.. లేదా కొందరికి క్రీములు వాడే అలవాటు ఉంటుంది ఇలాంటివారు స్నానానికి ముందు ఈ ఆయిల్ ను రాసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.. 

అలాగే కళ్ళ కింద వచ్చే నల్ల మలయాలను తగ్గించడంలోనూ జీవం కోల్పోయిన శరీరాన్ని తిరిగి మునుపటి రూపానికి తీసుకురావడంలోనూ ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది.. కండరాలను నొప్పికి సైతం విటమిన్ ఈ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది విపరీతంగా కీళ్ల నొప్పులు కండరాలను నొప్పులతో బాధపడేవారు మసాజ్ చేసినప్పుడు ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది.

కొందరు ముఖం మడతలు పడి నిర్జీవంగా మారుతుంది ఇలాంటివారు ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల ముడతలు మాయమై యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు.

అలాగే వృద్ధాప్యం దూరం చేయడంలో కూడా ఇది ముందు ఉంటుంది. దీంట్లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ ముఖంపై రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసి ముడతలను దూరం చేస్తాయి..

అలాగే తలకు రాసుకునే ఎలాంటి నూనెలో అయినా కొంత విటమిన్ ఈ ఆయిల్ లో కలిపి రాయడం వల్ల జుత్తు ఆరోగ్యంగా పెరుగుతుంది..

అలాగే కళ్ళ కింద వచ్చే నల్ల మలయాలను తగ్గించడంలోనూ జీవం కోల్పోయిన శరీరాన్ని తిరిగి మునుపటి రూపానికి తీసుకురావడంలోనూ ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.