Deep sleep : నిద్రలో గాఢనిద్ర పట్టేది ఎంత సేపో తెలుసా.. !

సాధారణంగా నిద్రపోయే సమయాన్ని లెక్కించడంలో చాలా ఉంటాయని తెలుస్తుంది ఇందులో ముఖ్యంగా deep sleep ఎంతసేపు పట్టింది అనేదాన్ని బట్టి నిద్ర యొక్క నాణ్యతను చెప్పవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు

Deep sleep : నిద్రలో గాఢనిద్ర పట్టేది ఎంత సేపో తెలుసా.. !
how long it takes to get deep sleep


నిద్రకి deep sleep కి చాలా తేడా ఉంటుంది. కొందరు నిద్రపోతున్నట్టే ఉంటారు కానీ ప్రతి విషయానికి మెలకువ వస్తుంది. ముఖ్యంగా మనస్ఫూర్తిగా నిద్రపోయాం అన్న ఆలోచన కూడా ఉండదు అయితే పడుకునే సమయం ఎంత సేపు అనేదిdeep sleep బట్టే లెక్కిస్తారని తెలుస్తోంది..

సాధారణంగా నిద్రపోయే సమయాన్ని లెక్కించడంలో చాలా ఉంటాయని తెలుస్తుంది ఇందులో ముఖ్యంగా గాఢనిద్ర ఎంతసేపు పట్టింది అనేదాన్ని బట్టి నిద్ర యొక్క నాణ్యతను చెప్పవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఒక మనిషి నిద్రపోయిన తర్వాత దాదాపు 85% గాఢ నిద్రలో ఉంటేనే ఆ మనిషి పూర్తిస్థాయిలో నిద్రపోయాడని అర్థం.. అలాగే ఎవరికైనా మంచం మీదకి చేరిన వెంటనే నిద్ర రాదు. కానీ 30 నిమిషాల్లోగా మాత్రం కచ్చితంగా నిద్ర వచ్చేయాలని అంతకన్నా దాటితే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు లెక్కించాలని తెలుస్తోంది.. 

అలా కాకుండా కాసేపు నిద్రపోయి మరి కాసేపు మెలకువతో ఉంటూ ఉండటం వల్ల సరైన నిద్ర అనేది కాదని దీనివల్ల ఆరోగ్యం పైన చెడుపు ప్రభావం పడుతుందని తెలుస్తోంది అంతేకాకుండా ఇది దీర్ఘకాలం కొనసాగితే మెదడు ఆరోగ్యం పైన కూడా ప్రభావం ఉంటుందంట. అలాగే వృద్ధాప్యంలో వచ్చే పలు రకాల సమస్యలకు కూడా ఇదే కారణం మాట అలాగే అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా నిద్రలేమి దారితీస్తుందని తెలుస్తోంది..

అందుకే నిద్రపోయే సమయాన్ని చాలా నాణ్యతగా ఉంచుకోవాలని అంటున్నారు నిపుణులు. కచ్చితంగా గాఢనిద్రని ఏర్పరచుకోవాలని అందుకోసం అనవసరమైన ఆలోచనలు ముందుగా దూరం చేసుకోవాలని తెలుస్తోంది అలాగే నిద్రపోయే సమయంలో ఎలాంటి ఎలక్ట్రానిక్స్ దగ్గరలో ఉంచుకోకూడదని అలాగే నిద్రపోయే గది చాలా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు నిపుణులు... అలాగే కొన్నిసార్లు అలసిపోయిన తర్వాత గాడ నిద్రలోకి వెళుతూ ఉంటారు ఇలాంటి సమయంలో నిద్ర లేచాక శరీరం ఎంతో తేలికగా అనిపించడానికి కారణం కూడా మెదడు ఉత్తేజితం కావడమే అందుకే శరీరానికి మెదడుకి కావలసినంత విశ్రాంతిని కచ్చితంగా ఇవ్వాలి. అయితే కొందరు నిద్ర సరిగ్గా పట్టడం లేదు అనే ఆలోచనలో ఉంటారు కానీ ఇది ఎంత మాత్రం సరైనది కాదు నిద్ర పట్టకపోవడం వెనక ఉన్న కారణాలని కచ్చితంగా విశ్లేషించుకోవాలి. ఒత్తిడి లను దూరం చేసుకోవాలి మానసిక ప్రశాంతతను దగ్గర చేసుకోవాలి జీవితంలో ఉన్న సమస్యలను దూరం చేసుకొని ప్రశాంతమైన గాఢనిద్రను ఏర్పాటు చేసుకోవడం వల్ల మనిషి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటాడని తెలుస్తోంది అంతేకాకుండా అతని ఆయుష్షు కూడా ఐదేళ్లు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనాల్లో తేలింది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.