నైట్‌ ఇవి తింటే.. పీడకలలు వస్తాయట..! 

Health : మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం బాగుంటుంది.. ఏదో ఒకటి కడుపునిండా తింటున్నాం కదా అనుకుంటే పొరపాటే. తినే ఆహారంలో పోషకాలు, స్వచ్ఛమైనవి అయి ఉండాలి.

నైట్‌ ఇవి తింటే.. పీడకలలు వస్తాయట..! 


Health : మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం బాగుంటుంది.. ఏదో ఒకటి కడుపునిండా తింటున్నాం కదా అనుకుంటే పొరపాటే. తినే ఆహారంలో పోషకాలు, స్వచ్ఛమైనవి అయి ఉండాలి.. అప్పుడే మీ చర్మం, జుట్టు మొత్తం అంతా బాగుంటుంది. కానీ మీకు ఈ విషయం తెలుసా.. నైట్‌ మీరు తినే ఆహారాన్ని బట్టే మీకు కలలు వస్తాయి అని.. కొన్ని తినకూడనివి తింటే.. రాత్రుళ్లు పీడకలలు వస్తాయట.. క్రేజీగా ఉంది కదూ..!

నిద్ర లేకపోవడం మీ శరీరంపై వివిధ ప్రభావాలను కలిగిస్తుంది. మీరు తినే ఆహారాలు కూడా మీ నిద్రలేమి సమస్యకు కారణం అవుతాయి.. నిద్రలేమి, చెడు కలలను కలిగించే కొన్ని ఆహారాలు ఇవే..
వేడి సాస్‌ల అధిక వినియోగం వల్ల.. శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు దారితీస్తుంది. ఇది వేగవంతమైన కంటి కదలికతో నిద్రలో కలల రూపాన్ని మరింత మారుస్తుంది. దీనివల్ల పీడకలలు వస్తాయట..మీరు ప్రశాంతమైన మంచి నిద్రను పొందలాంటే.. ఇవి రాత్రుళ్లు తినకండి.
బ్రెడ్, పాస్తాలో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలో గ్లూకోజ్‌గా మారుతాయి. చక్కెర కలిగిన ఆహారాలు మీ శరీరంపై అదే ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇది క్రమరహిత నిద్ర, చెడు కలలను కలిగిస్తుంది. కాబట్టి ఇవి కూడా మంచివి కావు.
చాక్లెట్‌లో కెఫిన్ పుష్కలంగా ఉంటుందని మీకు బాగా తెలుసు.. రాత్రుళ్లు కాఫీ తాగితే.. నిద్రరాదు.. ఒకవేళ నిద్రపట్టినా గాఢ నిద్రలో ఉండే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అశాంతి, పీడకలలను కూడా కలిగిస్తుంది. ఫలితంగా మీరు నిద్రలేమికి గురవుతారు.
చిప్స్ వంటి పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్‌ పడుతుంది. రాత్రిపూట వాటిని తినడం వల్ల చంచలత్వం, క్రమరహిత నిద్ర వస్తుంది. ఇది తరచుగా భయంకరమైన పీడకలలను కూడా కలిగిస్తుంది. దీని వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టదు.
వేడి కోకో.. ఇది చక్కెర, పాలు, కోకో పౌడర్ ఉపయోగించి తయారు చేస్తారు.. తినేటప్పుడు శరీరాన్ని తక్షణమే వేడి చేస్తుంది. రాత్రిపూట ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం, రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా నిద్ర దెబ్బతింటుంది.
పెరుగు కూడా.. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది. శ్వాసకోశ వ్యవస్థను అడ్డుకుంటుంది. మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. అశాంతి, చెడు కలలను కూడా కలిగిస్తుంది. ఇది మీ రాత్రి నిద్రను ప్రభావితం చేస్తుంది.
సోడాలో చక్కెర, కెఫిన్ కంటెంట్ ఘోరంగా ఉంటాయి.. ఇది నిద్రలో కూడా మెదడును నేరుగా ప్రేరేపిస్తుంది. కలలను కలిగిస్తుంది. దీని వల్ల మీరు ప్రశాంతమైన నిద్రను పొందలేరు.
చీజ్‌లో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపించే హార్మోన్ సెరోటోనిన్‌కు పూర్వగామిగా పనిచేస్తుంది. అధ్యయనాల ప్రకారం తేలిందేంటంటే.. ఇది తింటే..తరచుగా నిద్ర సమస్యలను కలిగిస్తుందట.. చెడు కలలకు కారణం అవుతుంది. అందువల్ల స్టిల్టన్ చీజ్ చెడ్డదని, రాత్రిపూట దీనికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.