Salt : ఉప్పు విషయంలో అపోహలివే.. ! అనుకుంటే నేను ఆరోగ్య సమస్యలు తప్పవు.. 

Salt ను ఎక్కువగా తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కొందరు మాత్రం salt ను ఎక్కువగా తీసుకున్న పర్వాలేదు. తాము మినహాయింపు అనుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ అపోహలే.

Salt : ఉప్పు విషయంలో అపోహలివే.. ! అనుకుంటే నేను ఆరోగ్య సమస్యలు తప్పవు.. 
facts about salt


Salt ను ఎక్కువగా తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కొందరు మాత్రం salt ను ఎక్కువగా తీసుకున్న పర్వాలేదు. తాము మినహాయింపు అనుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ అపోహలే.. 

ఎలాంటి శరీరతత్వం వాళ్లకైనా ఉప్పు హాని చేస్తుంది. తగు మొత్తంలో తీసుకున్నప్పుడు శరీరాన్ని కావలసిన పోషకాలు ఏ విధంగా అందుతాయో ఎక్కువగా తీసుకున్నప్పుడు అదేవిధంగా ప్రమాదం పొంచి ఉంటుంది.. అలాగే వేడి ప్రాంతాల్లో ఉండేవారు ఉప్పును ఎక్కువగా తీసుకున్న చెమట ద్వారా లవణాలు బయటకు పోతాయి కాబట్టి ఏ సమస్య ఉండదు అని అనుకుంటారు కానీ ఇది నిజం కాదు..

ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే నీరు తగ్గిపోవడమే కాకుండా బాడీ డిహైడ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉంది.. అలాగే అయోడిసిడ్ సాల్ట్ ఎంత ఎక్కువగా తిన్న ఆరోగ్య సమస్యలు రావు అనుకోవటం కూడా వట్టి అపోహ.. 

ఇప్పటికే చాలా ఏళ్ల బట్టి ఉప్పు ఎక్కువగా తింటున్నాం. ఏమీ కాలేదు ఇక మీదట ఏమీ కాదు అనుకోవడం కూడా ఆపోహే ఇకమీదటైనా ఉప్పును క్రమక్రమంగా తగ్గించాలి లేదంటే గుండె కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తగా మానదు. అలాగే వృద్ధులు మాత్రమే ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు మిగిలిన వారంతా తీసుకోవచ్చు అనేది కూడా ఆపోహే.. ఎక్కువగా తీసుకుంటే ఏ వయసు వారికైనా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.. అలాగే బయట ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తింటాము కదా ఏం కాదు అనుకుంటాం కానీ ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు దీని వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతింటుంది.. ఉప విషయంలో ఉన్న ఇలాంటి అపోహాలన్నీ తొలగించుకొని రోజు ఉపయోగించే ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించుకోవడం వల్ల దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.