రోజు తీసుకునే ఆహారంలో తగినంత కాల్షియం లేదా? ఎముకలు పటుత్వం కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి జాగ్రత్త సుమా!

మన శరీరంలో ఎముకల పట్టుత్వానికి క్యాల్షియం ఎంతగానో తోడ్పడుతుంది. కేవలం ఎముకలే కాదు, దంతాలు ఆరోగ్యంగా, రక్తం సాధారణంగా గడ్డకట్టేలా చేయడానికి, కండరాలు, నాడుల కదలికలతో పాటు గుండె ఆరోగ్యానికి క్యాల్షియం ఎంతగానో అవసరం. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల శరీరానికి కాల్షియం తగినంత అందకపోతే శరీరం ఎముకల నుంచి కాల్షియం తీసుకుంటుంది.

రోజు తీసుకునే ఆహారంలో తగినంత కాల్షియం లేదా? ఎముకలు పటుత్వం కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి జాగ్రత్త సుమా!


మన శరీరంలో ఎముకల పట్టుత్వానికి క్యాల్షియం ఎంతగానో తోడ్పడుతుంది. కేవలం ఎముకలే కాదు, దంతాలు ఆరోగ్యంగా, రక్తం సాధారణంగా గడ్డకట్టేలా చేయడానికి, కండరాలు, నాడుల కదలికలతో పాటు గుండె ఆరోగ్యానికి క్యాల్షియం ఎంతగానో అవసరం. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల శరీరానికి కాల్షియం తగినంత అందకపోతే శరీరం ఎముకల నుంచి కాల్షియం తీసుకుంటుంది. దాంతో ఎముకల గట్టిదనం తగ్గి పెలుసుగా తయారవుతాయి. దీన్నే ఆస్టియోపోరోసిస్ గా పిలుస్తుంటారు. ఈ కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతా ఈ ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొలది పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Calcium Rich Foods, Fruits, Vegetables Name List to add in Your Diet

శరీరానికి తగినంత క్యాల్షియం తీసుకోకపోతే రక్తపోటు సమస్యా అధికం అవుతుంది. ఫలితంగా గుండె జబ్బు ముప్పూ పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా వృద్ధులు ఎముకల క్షీణతను నివారించుకోవటానికి క్యాల్షియం మాత్రలు తీసుకోవటం చూస్తుంటాం. అయితే ఇలా మాత్రల రూపంలో కాల్షియం తీసుకోవడం శరీరానికి హాని చేస్తున్నట్టు ఇటీవల కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా వృద్ధుల్లో గుండె కవాటాల సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు వెల్లడైంది. అందుకే నేరుగా ఆహారం ద్వారానే శరీరానికి కావాల్సినంత కాల్షియం లభించేలా చూసుకోవాలని చెప్తున్నారు వైద్యులు.  పెద్దవారు ఐతే సగటున రోజుకు 1,000 నుంచి 1,200 మి.గ్రా. క్యాల్షియం అవసరం. 

మనకు కావాల్సిన క్యాల్షియం అన్ని రకాల పాల పదార్థాల్లో పుష్కలంగా లభిస్తుంది. అందుకే పాలు, పెరుగు, చీజ్ వంటి వాటిని రోజు తీసుకుంటూ ఉండాలి. అలాగని క్యాల్షియం ఒక్కటే తీసుకున్నా చాలదు. శరీరం సరిగా గ్రహించుకునేలా చూసే విటమిన్‌ డి కూడా మనకి అవసరమే. అందుకే రోజూ శరీరానికి కాసేపు ఎండ తగిలేలా చూసుకుంటే చర్మమే విటమిన్‌ డిని తయారు చేసుకుంటుంది. సాల్మన్‌, టూనా వంటి కొవ్వుతో కూడిన చేపలు.. పుట్టగొడుగులతోనూ దీన్ని పొందొచ్చు. గుడ్డు పచ్చసొనలోనూ కొంతవరకు విటమిన్‌ డి ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.