Muscle cramp : కాళ్లు, చేతులు తిమ్మిర్లు.. కారణం ఏంటంటే..
Muscle cramp : శరీరానికి నిత్యం పోషకాలు అందించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా అన్ని రకాల విటమిన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు అందించకపోతే శరీరం నీరసపడిపోయి

Muscle cramp : శరీరానికి నిత్యం పోషకాలు అందించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా అన్ని రకాల విటమిన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు అందించకపోతే శరీరం నీరసపడిపోయి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే పోషకాహారం తీసుకోవడం ఎంతైనా అవసరమని చెబుతున్నారు నిపుణులు. అలాగే కొన్ని రకాల విటమిన్లు లోపిస్తే కాళ్లు, చేతులు తిమ్మిర్లు పెట్టడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని తెలుస్తోంది..
కొందరికి విపరీతంగా కాళ్లు, చేతులు తిమ్మిర్లకు గురవుతూ ఉంటాయి. అయితే ఇందుకు గల కారణాలు ఏమిటంటే.. కొన్ని రకాల విటమిన్లు లోపమేనని తెలుస్తోంది. ముఖ్యంగా శరీరంలో పోషకాలు లోపిస్తే ఎన్నో రకాల సమస్యలు వస్తాయని.. అందులో విటమిన్లు లోపిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని తెలుస్తోంది..
అలాగే రాత్రి సమయంలో నిద్ర పోయేటప్పుడు ఈ తిమ్మిర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపుకు మాత్రమే తిరిగి పడుకోవడం వల్ల రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. దీని వలన కాళ్లు చేతులు పట్టేసినట్టు అనిపించడం, తిమ్మిర్లు ఏర్పడటం జరుగుతుంది. అయితే తిమ్మిరికి గురైన భాగాన్ని చేత్తో గట్టిగా రుద్దటం వలన ఉపశమనం లభిస్తుంది. అలాగే కొన్ని రకాల వ్యాధులు ఉన్న వారికి సైతం కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కువగా కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా థైరాయిడ్ వ్యాధి ఉన్నా.. అధిక రక్తపోటు, టీబీ ఉన్నా కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నిత్యం మందులు తీసుకోవాల్సి ఉంటుంది. వీటి ప్రభావం వల్ల కూడా నిద్రపోయే సమయంలో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటితో పాటు పోషకాహార లోపం కూడా కారణమని తెలుస్తోంది.
ఈ కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు అనేవి నరాల పైన ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఇది నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపటం వల్ల ఈ సమస్యను తీవ్రంగానే పరిగణించాలి. అయితే శరీరంలో విటమిన్ బి, ఇ వంటి లోపం వల్ల కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఏర్పడతాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగితే కాళ్లు, చేతులు పనిచేయడం మానేస్తాయి. అందుకే మొదట్లోనే ఈ సమస్యను గుర్తించి వైద్యుల్ని సంప్రదించాలి. అంతేకాకుండా పోషకాహారం తీసుకోవాలి. అన్ని రకాల కాయగూరలు, పండ్లు, పాలు, గుడ్లు, పప్పు దినుసులు వంటి వాటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని తెలుస్తోంది..