World Health Day 2023 : అందరికీ ఆరోగ్యం..ఈ ఆహారాలతోనే అది సాధ్యం..!!

World Health Day 2023 : ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం... కానీ ఎవ్వరూ ఆరోగ్యంగా లేరు.. ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు.. డయబెటిస్, బీపీ, హార్ట్‌ ప్రాబ్లమ్స్‌, ఊబకాయం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాలానే ఉంది. ప్రతీ ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య

World Health Day 2023 : అందరికీ ఆరోగ్యం..ఈ ఆహారాలతోనే అది సాధ్యం..!!


World Health Day 2023 : ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం... కానీ ఎవ్వరూ ఆరోగ్యంగా లేరు.. ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు.. డయబెటిస్, బీపీ, హార్ట్‌ ప్రాబ్లమ్స్‌, ఊబకాయం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాలానే ఉంది. ప్రతీ ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటైంది కూడా ఈరోజే. అప్పట్నించీ ఈరోజును ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తున్నారు. 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. "అందరికీ ఆరోగ్యం" అనేది ఈ సంవత్సరం థీమ్.
World Health Day 2022 Theme and Major Highlights | World Health Day Theme  2022
మనందరికీ తెలుసు మనం ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది ఆహారం. మనం తినే ఆహారమే ఔషధం. కడుపునిండా తింటున్నాం అని కాదు.. ఎన్ని పోషకాలను కవర్‌ చేసేలా తింటున్నాం అనేది ముఖ్యం. తినే ఆహారంలో ఎన్ని కాలరీలు, కార్బోహైడ్రేట్స్‌, ఫైబర్‌, మినరల్స్‌, ప్రోటీన్స్‌ ఇవి ఎన్ని ఉంటున్నాయి అని చూసుకుని తినాలి. ఆరోగ్యానికి సరైన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆరోగ్యానికి సరైన ఆహారాలు..

మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే...

తాజా పండ్లు, కూరగాయలు..

మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సీజన్‌కు తగినట్లుగా లభించే వివిధ రకాల పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పాలకూర, మెంతికూర, కాలే వంటి ఆకు కూరలు. అరటిపండ్లు, నారింజలు, ఆపిల్స్, బెర్రీ ఫ్రూట్స్, ద్రాక్షపండ్లు వంటి పండ్లను తింటూ ఉండాలి. విటమిన్‌ సీ ఉంటే ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. రోజూ ఈ కోవకు చెందిన ఒక పండు అయినా తినేలా చూసుకోవాలి.

తృణధాన్యాలు..

కేవలం అన్నం మాత్రమే తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రోటీన్లు, ఫైబర్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే తృణధాన్యాలను ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవాలి. ఇందులో భాగంగా గోధుమలు, వోట్స్, బ్రౌన్ రైస్ వంటివి మీకు మంచి శక్తిని ఇస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మాంసకృత్తులు..

మాంసకృత్తులు మీ శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి అవసరం అవుతాయి.. కాబట్టి మీ ఆహారంలో చికెన్, చేపలు, బీన్స్, కాయధాన్యాలు టోఫు వంటివి తినండి. వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మటన్ వంటి మాంసాల మాదిరిగా కాకుండా లీన్ ప్రోటీన్లలో అనారోగ్యకరమైన సంతృప్త కొవ్వులు ఉండవు.

గింజలు- విత్తనాలు..

బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు మొదలైనవి మీ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ , విటమిన్ E, మెగ్నీషియం , సెలీనియం వంటి మీ శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు నిండుగా ఉంటాయి. వీటిని సరైన పరిమాణంలో తీసుకుంటూ ఉండాలి.

ఆరోగ్యకరమైన కొవ్వులు

ఆలివ్ ఆయిల్, అవకాడో, సాల్మన్ వంటి కొవ్వు చేపలలో లభించే కొవ్వులను ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.. వీటన్నింటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఈ కొవ్వులు గుండె ఆరోగ్యానికి , మెదడు పనితీరుకు మేలు చేస్తాయి.
ప్రతిరోజూ ఇలాంటి ఆహారాలను తింటే.. మీ ఆరోగ్యం బాగుంటుంది.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్‌లకు తగ్గించండి.. రోజూ సరిపడా నీరు తాగడం, వ్యాయామం, ఒత్తిడిని నియంత్రించడం, తగినంత నిద్రపోవడం వంటివి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.