జుట్టుకు అస్సలు నూనె రాయకూడదా..! నిపుణులు ఏమంటున్నారంటే.. 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య విపరీతంగా జుట్టు రాలటం ఆడ మగ ఇద్దరిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది మగవారిలో ఇది బట్టతలకు దారితీస్తే

జుట్టుకు అస్సలు నూనె రాయకూడదా..! నిపుణులు ఏమంటున్నారంటే.. 
hair oil


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య విపరీతంగా జుట్టు రాలటం ఆడ మగ ఇద్దరిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది మగవారిలో ఇది బట్టతలకు దారితీస్తే ఆడవారిలో ఆత్మన్యునతకు సైతం దారితీస్తుంది అయితే జుట్టు ఊడిపోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. 

జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు సరైన పోషకాహారం తీసుకోకపోవడం అధిక ఒత్తిడి సమయానికి తగినంత నిద్ర లేకపోవడం ఈ మూడు కారణాలతో జుట్టు రాలడం సమస్య తీవ్రతరం అవుతుంది అందుకే వీటిని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. మరి ఎక్కువగా జుట్టు ఊడుతుంటే శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందేమో పరీక్షించుకోవాలి అలాగే శరీరంలో విటమిన్ బీట్ వాళ్లు విటమిన్ డి తక్కువగా ఉన్న ఈ సమస్య వస్తూ ఉంటుంది అయితే కొందరిలో థైరాయిడ్ సమస్య కూడా జుట్టు ఊడిపోవడానికి కారణం.. అలాగే స్కాల్పుకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా విపరీతంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది అయితే ఈ విషయంపై నిపుణుల సలహా మేరకు సీరమ్, షాంపూలు వాడటం మంచిది.. 

అయితే ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారంటే కొందరు జుట్టుకి ఎక్కువగా నూనె రాస్తూ ఉంటారు మరి జిడ్డులా కారేంతవరకు నూనె రాయడం అసలు మంచిది కాదని తెలుస్తోంది ముఖ్యంగా జుట్టుకి నూనె ఏ రకంగా సహాయ పడదని నిపుణుల అభిప్రాయం అయితే మరీ పొడిబారినట్టు మారి ఇబ్బంది పెడుతూ ఉంటే తలస్నానానికి గంట ముందు జుట్టుకు నూనెను రాసి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసేయాలి తలపై నూనెను ఎక్కువ సేపు ఉంచడం వల్ల చుండ్రు సమస్య మరింత ఎక్కువవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. అయితే కొందరు నూనె వల్లే జుట్టు పెరుగుతుంది అని అపోహలో ఉంటారు కానీ ఇది అన్నివేళలా సరైన పద్ధతి కాదు.. కనీసం మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయడం ఎంతైనా అవసరం.. 

అలాగే వీలైనంతవరకు ఒత్తిడిని దూరం చేసుకోవాలి రోజు సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి వీలైతే వ్యాయామం ధ్యానం వంటివి చేయాలి సరైన పోషకాహారం తీసుకుంటూ ఉండటం వల్ల ఈ సమస్య నుంచి దూరం కావచ్చు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.