ఈ డ్రింక్‌ తాగితే లివర్‌ డీటాక్సిఫై అవుతుంది.. ఇలా ఈజీగా తయారుచేసుకోవచ్చు..!

శరీరంలో కీల‌క‌మైన విధులన్నింటిని Liver నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో కాలేయం ముందు ఉంటుంది.

ఈ డ్రింక్‌ తాగితే లివర్‌ డీటాక్సిఫై అవుతుంది.. ఇలా ఈజీగా తయారుచేసుకోవచ్చు..!
liver detoxy juice


శరీరంలో కీల‌క‌మైన విధులన్నింటిని Liver నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో కాలేయం ముందు ఉంటుంది. మందుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌, మ‌ద్య‌పానం వ‌ల్ల శ‌రీరంలో చేరే విషాల‌ను కాలేయం బ‌య‌ట‌కు పంపిస్తుంది. కాలేయాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. అయితే మీకు ఏమైనా కాలేయ సమస్యలు ఉన్నా కొన్ని ఆయుర్వేద చిట్కాలతో సమస్యను నయం చేసుకోవచ్చు.. కాలేయ సమస్యలు లేకున్నా..ఇవి తాగితే.. కాలేయ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజుల్లో ఎవ్వరూ ఆర్గానిక్ ఉండేవి తినడం లేదు. తినే ఆహారంలో, తాగే ఆహారంలో అన్నీ కలుషితం అవుతున్నాయి. కాలేయంలోని మ‌లినాల‌ను తొల‌గించి కాలేయాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే ఒక డిటాక్స్ డ్రింక్‌ను మన ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ పానీయాన్ని తీసుకున్న 24 గంట‌ల్లోనే కాలేయంలోని మ‌లినాలు తొల‌గిపోవ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. మ‌న శ‌రీరానికి మేలు చేసే ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం సొర‌కాయ ముక్క‌లను, కొత్తిమీర‌ను, ప‌సుపును,నిమ్మ‌ర‌సాన్ని, బ్లాక్ సాల్ట్‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో సొర‌కాయ ముక్క‌ల‌ను, గుప్పెడు కొత్తిమీర‌ను, కొద్దిగా నీటిని పోసి జ్యూస్ లాగా చేసుకోవాలి. 

ఈ జ్యూస్‌ను ఒక గ్లాస్‌లోకి తీసుకుని అందులో పావు టీ స్పూన్ ప‌సుపును వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత అందులో అర చెక్క నిమ్మ‌రసాన్ని, రుచికి త‌గినంత బ్లాక్ సాల్ట్‌ను వేసి క‌ల‌పాలి. బ్లాక్ సాల్ట్ అందుబాటులో లేని వారు ఇందులో రాళ్ల ఉప్పును కూడా వేసుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల కాలేయం డిటాక్స్ డ్రింక్ త‌యార‌వుతుంది. ఈ పానీయాన్ని ఉద‌యం అల్పాహారం చేసిన అర గంట త‌రువాత తీసుకోవాలి.

ఈ పానీయాన్ని తీసుకున్న త‌రువాత గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు, తాగ‌కూడ‌దు. 

ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా మూడు రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల కాలేయంలోని వ్య‌ర్థాలు తొల‌గిపోయి కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. 

ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం కూడా శుభ్ర‌ప‌డుతుంది. శ‌రీరంలోని మ‌లినాల‌న్నీ తొల‌గిపోతాయి. 

ఈ చిట్కాను పాటిస్తూనే తాజా కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను ఆహారంగా తీసుకోవాలి. 

జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. నీటిని ఎక్కువ‌గా తాగాలి. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.