బీరకాయను తరచూ తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయమే!

ఇప్పటి తరం పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయారు. దాంతో కాయగూరలు, ఆకుకూరలు తినేందుకు ఇష్టపడటం లేదు. దాంతో తల్లిదండ్రులు సైతం వాళ్లకు ఇష్టం అంటూ అలాంటి ఆహారాన్నే పెడుతున్నారు. కానీ.

బీరకాయను తరచూ తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయమే!


ఇప్పటి తరం పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయారు. దాంతో కాయగూరలు, ఆకుకూరలు తినేందుకు ఇష్టపడటం లేదు. దాంతో తల్లిదండ్రులు సైతం వాళ్లకు ఇష్టం అంటూ అలాంటి ఆహారాన్నే పెడుతున్నారు. కానీ... వాళ్ల ఇష్టాలతో పాటు ఆరోగ్యాన్ని చూసుకోవాలి.  అందుకే... వారి ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాంటి కూరగాయలను నిత్యం ఆహారంలో భాగంగా ఇస్తూ ఉండాలి..

బీరకాయలు తినడం వల్ల కలిగే ఉపయోగాలు.. 

అధిక బరువుతో బాధపడుతూ... బరువు తగ్గించుకోవాలనుకొనే వారు డైట్ లిస్ట్ లో బీరకాయని చేర్చుకోవడం మంచిది. ఈ కూరగాయ రక్తశుద్ధికీ,  కాలేయ ఆరోగ్యానికీ బాగా తోడ్పడుతుంది. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ సైతం ఈ కూరగాయ రక్షిస్తుంది. అందుకే ఎక్కువగా మందు తీసుకునే వాళ్ల ఆహారంలో బీరకాయ చేర్చితే వారి కాలేయానికి ఎలాంటి ఢోకా ఉండదు మరి. 

అలాగే బీరకాయలోని సెల్యులోజ్ అధికం. ఇది కడుపు, ఉదర సంబంధిత సమస్యలు నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బీరకాయలో డైటరీ ఫైబర్ తో పాటు, బీటా కెరోటిన్ పుష్కలం. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బీరకాయలో పీచు పదార్థం సైతం పుష్కలంగా ఉంటుంది.
బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. విరేచన కారి  మలబద్ధకం నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైల్స్ తో బాధపడే వారు దీన్ని తీసుకోవడం చాలా మంచిది. 

బీరకాయలను తరచుగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు నివారించుకోవచ్చు. కంటి సమస్యలు వున్న వాళ్ళు మంచి చూపు కోసం బీరకాయలు ప్రాధాన్యత ఇవచ్చు. బీరకాయల్లో బి6 సహా పలు రకాల ప్రోటీనులు, విటమిన్లు వుంటాయి. ఇవన్నీ మన రోగ నిరోధక శక్తి పెంచే విధంగా పని చేస్తాయి. బీరకాయలోని పెప్టైడ్స్ రక్తము, మూత్రంలోని షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. బ్లడ్ ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.