తెల్ల తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? క్యాన్సర్‌ సైతం నయం చేస్తుంది.!

తేనె గురించి తెలియని వాళ్లు, దాని రుచి ఒక్కసారైనా చూడని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందం నుంచి ఆరోగ్యం వరకూ తేనె రారాజు. అంత మంచి ఔషధగుణాలను కలిగి ఉంది. తేనె సాధారణంగా గోధుమ రంగులో

తెల్ల తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? క్యాన్సర్‌ సైతం నయం చేస్తుంది.!


తేనె గురించి తెలియని వాళ్లు, దాని రుచి ఒక్కసారైనా చూడని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందం నుంచి ఆరోగ్యం వరకూ తేనె రారాజు. అంత మంచి ఔషధగుణాలను కలిగి ఉంది. తేనె సాధారణంగా గోధుమ రంగులో ఉంటుంది. కానీ మీకు తెలుపు రంగులో ఉండే తేనె గురించి తెలుసా..? ఇది ఎలా వస్తుంది..? మీరు ఎప్పుడైనా తేనె తీసుకునేప్పుడు ఒకవేళ అది తెలుపు రంగులో ఉంటే ఇది మంచి తేనె కాదు, కల్తీ అని పక్కనపెడతారేమో..? తెలుపు రంగులో తేనె చాలా మంచిది. తెల్ల తేనెను ముడి తేనె అని కూడా అంటారు. మరి ఈ తెల్లటి తేనె వల్ల కలిగే లాభాలు ఏమిటి..? తెల్ల తేనె తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులకు దూరంగా ఉండవచ్చు.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తెలుపు రంగులో ఉన్నటువంటి తేనెలో మెగ్నీషియం, భాస్వరం, జింక్ లతో విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ తెల్ల తేనెను హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల దీనిని ఈ విధంగా హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తారు. ఈ తెల్ల తేనెను ఉపయోగించి దగ్గు, గుండె జ‌బ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.

ప్రస్తుతం వాతావరణంలో మార్పులు కారణంగా చాలా మంది దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో టేబుల్ స్పూన్ తెల్ల తేనె, నిమ్మరసం కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. 

ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెను తాగటం వల్ల నోటిలో ఏర్పడే నోటి పుండ్లు, నోటి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తొలగిపోతాయి. గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇలా తెల్ల తేనెతో ఎన్నో ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈసారి ఎప్పుడైనా తెల్ల తేనె కనిపిస్తే లైట్‌ తీసుకోకండి.. కచ్చితంగా కొనేయండి మరీ..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.