Health : గర్భసంచిలో గడ్డలు ఉంటే..పిల్లలు పుట్టడం కష్టమేనా..?

Health : ఆడవాళ్లకు గర్భసంచికి సంబంధించి చాలా సమస్యలు వస్తాయి.. దీనివల్ల కొందరికి పిల్లలు పుట్టడం కూడా కష్టం అవుతుంది. గర్భసంచిలో గడ్డలు రావడం అనేది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది.

Health : గర్భసంచిలో గడ్డలు ఉంటే..పిల్లలు పుట్టడం కష్టమేనా..?


Health : ఆడవాళ్లకు గర్భసంచికి సంబంధించి చాలా సమస్యలు వస్తాయి.. దీనివల్ల కొందరికి పిల్లలు పుట్టడం కూడా కష్టం అవుతుంది. గర్భసంచిలో గడ్డలు రావడం అనేది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది. ఇలా గర్భసంచిలో కణితులు ఏర్పడితే ఆ స్త్రీ తల్లి కావడం కష్టం.. అయితే దీనికి ఇప్పుడు చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఆ గడ్డలను తొలగించుకుని మాతృత్వాన్ని పొందే అవకాశాన్ని పొందవచ్చు.. అసలు గర్భసంచిలో ఎందుకు గడ్డలు వస్తాయి? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..!

 గడ్డలు ఎలా ఏర్పడతాయి..

గర్భసంచిలో గడ్డలు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల కారణంగా ఇలా గడ్డలు పెరుగుతాయి. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు గర్భసంచిలో ఉండే ఫైబ్రాయిడ్‌ల పరిమాణం పెరిగిపోతుంది. అవే గడ్డలుగా మారతాయి. వీటిపై ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ రెండు హార్మోన్ల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇలా గడ్డలు ఉంటే గర్భం ధరించడం అనేది జరిగేపని కాదు.. 
ఈ గడ్డలు గర్భాశయం లోపల ద్వారం దగ్గర, గోడల పొరలకు అతుక్కుని ఎక్కడైనా ఏర్పడవచ్చు. అందుకే ఇవి ఉన్నచోట పిండం తయారు కాదు. గర్భాశయంలోని లోపలి గోడల్లో ఈ గడ్డలు ఏర్పడితే అధికంగా రక్తస్రావం అవుతుంది. అధిక రక్తస్రావం కావడం, గర్భం ధరించలేకపోవడం వంటి లక్షణాల ద్వారానే వీటిని గుర్తిస్తారు. స్కానింగ్లో వీటి పరిమాణం ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది.. ఇవి వేరుసెనగ గింజల పరిమాణం నుంచి పుచ్చకాయ సైజు వరకు పెరుగుతాయి. వీటిని కణితి అంటారు.. పిల్లలు లేని వారికి ఈ గడ్డలు వస్తే వాటిని కరిగించి లేదా తొలగించడం ద్వారా సంతానం కలిగేలా చేస్తారు. చికిత్స వాటి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. వీటిని తొలగించాక గర్భం ధరించే అవకాశం ఉంది. కొన్ని గడ్డలు మందులతోనే కరిగిపోతాయి. కొన్ని మాత్రం సర్జరీ చేసి బయటకు తీస్తారు.. ఇవి రెండు కేజీల నుంచి ఐదు కేజీల వరకూ ఉంటాయి..
గర్భసంచిలో గడ్డల సమస్యతో బాధపడే వారికి బోనస్‌గా రక్తహీనత కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి అధిక రక్తస్రావం అవుతుంది. అందుకే ముందుగా రక్తహీనత సమస్యకు చికిత్స చేస్తారు. హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కాకుండా నియంత్రించే మందులను సూచిస్తారు. పిల్లలు లేనివారికి కణితిని తొలగించడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఉన్నవారికి గర్భసంచిని తొలగించడం ద్వారా శాశ్వత చికిత్స చేస్తారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.