రక్తనాళాల్లో మలినాలను తొలగించే.. డ్రింక్‌..తాగారంటే క్లీన్‌ స్విప్‌..!!

మనిషికి కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం అనేది చాలా ప్రమాదకరం.. దీనివల్లే గుండెజబ్బులు, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘాకాలిక రోగాలు వస్తాయి.. మనం ఆరోగ్యంగా ఉన్నా సరే.. కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా..

రక్తనాళాల్లో మలినాలను తొలగించే.. డ్రింక్‌..తాగారంటే క్లీన్‌ స్విప్‌..!!


మనిషికి కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం అనేది చాలా ప్రమాదకరం.. దీనివల్లే గుండెజబ్బులు, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘాకాలిక రోగాలు వస్తాయి.. మనం ఆరోగ్యంగా ఉన్నా సరే.. కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా.. ఫుల్‌ బాడీ చెకప్‌ చేయించుకోవాలి.. అప్పుడే పొంచి ఉన్న ప్రమాదాలను కనిపెట్టవచ్చు.. గుండెచుట్టు పరిస్థితి ఎలా ఉంది, కిడ్నీలు బానే ఉన్నాయా, లివర్‌లో ఎంత చెడిపోయింది, కొలెస్ట్రాల్‌ ఉందా లేదా, రక్తనాళాల్లో మలినాలు ఎంత ఉన్నాయి.. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. 

మ‌నం తీసుకునే ఆహారాల కార‌ణంగా గుండెలో మ‌లినాలు, విష ప‌దార్థాలు, టాక్సిన్లు పేరుకుపోతున్నాయి. ఈ మ‌లినాలు మ‌నం శ‌రీర అవ‌య‌వాల‌కు ర‌క్తాన్ని చేర‌వేసే ర‌క్త‌నాళాల్లో కూడా పేరుకుపోతున్నాయి. ఇలా పేరుకుపోవ‌డం వ‌ల్ల కొంత‌కాలానికి ర‌క్త‌నాళాలు పూడుకుపోతాయి. ఇలా పేరుకుపోవ‌డం వ‌ల్ల గుండె కొట్టుకోవ‌డం ఆగిపోతుంది. అంతేకాకుండా ర‌క్త‌నాళాల్లో మ‌లినాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో 100 పైగా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మ‌నం ర‌క్తనాళాలు ఎల్ల‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

రక్తనాళాలాల్లో మలినాలను శుభ్రం చేసే చిట్కా..!

సొర‌కాయ‌, కొత్తిమీర‌, పుదీనా, తులసి ఆకుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ నాలుగు ప‌దార్థాలు కూడా మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. అలాగే నాలుగు ప‌దార్థాలు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ జ్యూస్‌కు త‌గిన‌న్ని సొర‌కాయ ముక్క‌ల‌ను, 10 రెమ్మ‌ల కొత్తిమీరను, 10 రెమ్మ‌ల పుదీనాను, 10 తుల‌సి ఆకుల‌ను తీసుకోవాలి. వీట‌న్నింటిని ఒక జార్‌లో వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా జ్యూస్ లాగా చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న జ్యూస్‌ను ఆరు నుంచి ఏడు నెల‌ల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకుల‌న్నీ తొల‌గిపోతాయి. 
ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. 
షుగ‌ర్ వ్యాధి కూడా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. 
శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా త‌గ్గుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.