Muscle pain : నడవనివ్వని కండరాల నొప్పికి మానేయాల్సిన ఆహారం ఏమిటంటే.. 

Muscle pain bones pain అంత బాధ పెట్టదు. తీవ్రత తక్కువగా ఉండి లాగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే మనిషిని మాత్రం ఒక స్థిరంగా కూర్చొనివ్వదు. ఇదే నొప్పి పిక్కల్లో ఏర్పడితే మనిషిన సరిగ్గా కూర్చోలేడు. స్థితిలో నొప్పి చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది కలుగుతుంది.. 

Muscle pain : నడవనివ్వని కండరాల నొప్పికి మానేయాల్సిన ఆహారం ఏమిటంటే.. 
Foods to avoid for muscle pain


Muscle pain...ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామందికి bones ల్లో వచ్చే నొప్పికి Muscle pain కి తేడా తెలియదు.. సాధారణంగా ఎముకల్లో వచ్చే నొప్పి లోతు నుంచి వస్తుంది. కాబట్టి గుచ్చుతున్నట్టు పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ నొప్పి నిరంతరం ఎంతో బాధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
కండరాల నొప్పి ఎముకల నొప్పి అంత బాధ పెట్టదు. తీవ్రత తక్కువగా ఉండి లాగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే మనిషిని మాత్రం ఒక స్థిరంగా కూర్చొనివ్వదు. ఇదే నొప్పి పిక్కల్లో ఏర్పడితే మనిషిన సరిగ్గా కూర్చోలేడు. స్థితిలో నొప్పి చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది కలుగుతుంది.. 
 కండరాల నొప్పి రావడానికి ఒకటే కారణం ఉండదు. పలు రకాల కారణాలు ఉంటాయి. చిన్న వయసులో ఆడే ఆటలు తర్వాత కాలంలో ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా కొన్ని చోట్ల దెబ్బలు తగిలినప్పుడు ఈ పరిస్థితి తర్వాత కూడా కనిపించవచ్చు.

ఈ కండరాల నొప్పుల్లోనే చాలా రకాలు ఉన్నాయి. అలాగే ఆర్థరైటిస్ నొప్పి కూడా ఒకటి. ఈ నొప్పిలో కాలు బాగా బిగిసిపోయినట్టు అయిపోతుంది. ఆ భాగంలో బాగా నొప్పి వచ్చి వాపు కనిపిస్తుంది. ఒక్కోసారి చీము చేరుతుంది. 
కీళ్లలో నొప్పి వచ్చి అది బొటనవేలు దాకా పాకి పోతుంది. ఇలాంటి సమయంలో నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. సాధారణంగా కండరాలు నొప్పి 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది.
కండరాల నొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల ఈ నొప్పి అధికమవుతుంది. అయితే కొన్నిసార్లు అలవాటు లేని శ్రమ పడటం వల్ల కూడా దీని ప్రభావం కనిపిస్తుంది.
అలాగే థైరాయిడ్ వాటి సమస్యలు ఉన్నప్పుడు కీళ్ల నొప్పులు వేధిస్తాయి. ఎక్కువ శ్రమ పడటం, కాళ్ల పై భారం పడిన విధంగా పనులు చేయటం వంటివి కూడా కారణాలు.
ఈ కండరాల నొప్పి ఉన్నవారు ముఖ్యంగా వాటికి రక్తప్రసరణ సక్రమంగా జరిగేటట్టు చేయాలి. ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం చేయకూడదు. చేత్తో నొప్పి ఉన్న భాగాన్ని అదిమి పట్టాలి. ఏదైనా నూనెతో సున్నితంగా మర్దన చేయడం వల్ల కండరాల నొప్పి తగ్గుతుంది.
కండరాల నొప్పులు ఉన్నవారు కచ్చితంగా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాలను రోజు తీసుకోవడం వల్ల ఈ నొప్పులు తగ్గుతాయి. అలాగే వంకాయ, రాత్రిపూట పెరుగు వంటి వాటిని కచ్చితంగా మానేయాలి. వేరుశనగ నూనెను వాడకూడదు. దాని బదులుగా నువ్వుల నూనెను వాడుకోవచ్చు. మినువులు తీసుకోకపోవడం మంచిది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.