Acidity problems : కడుపులో మంట, గ్యాస్‌, అజీర్ణం.. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం..

ఈరోజుల్లో చాలమందికి gas, Acidity, stomach burning బాగా ఉంటుంది. టైమ్‌కు ఆహారం తినకపోతేనే ఈ సమస్యలు వస్తాయి. ఒకవేళ తిన్నా అవి మసాల ఐటమ్స్‌ అయితే ఇంకా ఎక్కువే. సాధారణంగా గ్యాస్‌, అసిడిటీ ఉంటే..

Acidity problems : కడుపులో మంట, గ్యాస్‌, అజీర్ణం.. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం..
Get rid of Stomach burning gas indigestion with this


ఈరోజుల్లో చాలమందికి gas, Acidity, stomach burning బాగా ఉంటుంది. టైమ్‌కు ఆహారం తినకపోతేనే ఈ సమస్యలు వస్తాయి. ఒకవేళ తిన్నా అవి మసాల ఐటమ్స్‌ అయితే ఇంకా ఎక్కువే. సాధారణంగా గ్యాస్‌, అసిడిటీ ఉంటే.. అందరూ మార్కెట్‌లో దొరికే పౌడర్లు తీసుకుని వాటర్‌లో కలుపుకొని తాగేస్తుంటారు. వీటి వల్ల ఆ క్షణం తగ్గినట్లు ఉంటుంది కానీ.. కొద్ది సేపటికి మళ్లీ మామూలే. కడుపులో మంటతోపాటు త్రేన్పులు, కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం.. వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఈ రెండు చిట్కాలను పాటిస్తే చాలు.. ఈ సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
ముందుగా 20 ఎంఎల్‌ పాలను తీసుకోవాలి. వాటిని మరిగించి చల్లార్చండి.. అనంతరం ఆ పాలను సగం గ్లాస్‌ నీటిలో కలపాలి. తరువాత ఆ మిశ్రమంలో ఒక టీస్పూన్‌ ఆవు నెయ్యి వేసి బాగా కలిపి తాగేయండి.. ఇలా చేయడం వల్ల అసిడిటీ, కడుపులో మంట నుంచి వెంటనే విముక్తి లభిస్తుంది. జీర్ణాశయంలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది.

భోజనం చేసిన అనంతరం చల్లని పాలను తాగాలి. అందులో చక్కెర కలపవచ్చు లేదా అలాగే కూడా తాగవచ్చు. ఇలా చేసినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
ఒక కప్పు తీసుకుని అందులో అర టీస్పూన్‌ వేయించిన జీలకర్ర పొడి, అర టీస్పూన్‌ పసుపు, ఒక టీస్పూన్‌ నల్ల ఉప్పు, ఒకటిన్నర టీస్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తాగేయాలి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకున్న తరువాత కొన్ని నిమిషాల్లోనే అసిడిటీ, గ్యాస్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మలబద్దకం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
గ్యాస్‌ నొప్పికి గుండె నొప్పికి పెద్దగా తేడా ఉండదు.. చాలామంది గ్యాస్‌ వల్ల పెయిన్‌ వస్తే అది ఎక్కడ హార్ట్‌ ఎటాక్‌కు దారితీస్తుందేమో అని భయపడతారు. కానీ గ్యాస్‌ కూడా చాలా ప్రమాదమే.. వీలైనంత వరకూ మసాల ఉండే ఆహారలను తక్కువగా తినండి. వేళకు సరిపడా ఆహారం తినాలి. వేళకాని వేళ అన్నం తింటే కూడా అది గ్యాస్‌, అసిడిటీకి దారితీస్తుంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.