మీ చేతులు బాగా లూస్‌గా ఉన్నాయా..? ఇలా చేస్తే నెలలోనే టైట్‌ అవుతాయి..!

శరీర ఆకృతి ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు చూసేందుకు సన్నగానే ఉంటారు కానీ.. చేతులు బాగా లూస్‌గా ఉంటాయి.. మనిషి సన్నగా ఉన్నా.. చేతులు ఇలా ఒదులుగా ఉంటే అది చూసేందకు ఏం బాగుండదు. మీ చేతులు కూడా అలానే లూస్‌గా ఉంటే.. చక్కని ఆకృతిలో కనిపించాలంటే.. ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలు ఉన్నాయి.. అవి చేశారంటే

మీ చేతులు బాగా లూస్‌గా ఉన్నాయా..? ఇలా చేస్తే నెలలోనే టైట్‌ అవుతాయి..!


శరీర ఆకృతి ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు చూసేందుకు సన్నగానే ఉంటారు కానీ.. చేతులు బాగా లూస్‌గా ఉంటాయి.. మనిషి సన్నగా ఉన్నా.. చేతులు ఇలా ఒదులుగా ఉంటే అది చూసేందకు ఏం బాగుండదు. మీ చేతులు కూడా అలానే లూస్‌గా ఉంటే.. చక్కని ఆకృతిలో కనిపించాలంటే.. ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలు ఉన్నాయి.. అవి చేశారంటే.. నెల రోజులనే మీ చేతులు టైట్‌గా మారి.. చక్కని ఆకృతిలో కనిపిస్తాయి. మ‌రి అందుకు చేయాల్సిన వ్యాయామాలు ఏమిటంటే..
Surgical Arm Lift vs. Laser Arm Lift - Which is Best?
నేల‌పై బోర్లా ప‌డుకుని అర చేతుల‌ను నేల‌కు ఆనించాలి. త‌రువాత శ‌రీరం పై భాగాన్ని పైకి, కింద‌కు క‌దిలిస్తూ పుష‌ప్స్ చేయాలి. ఇలా సెట్‌కు 10 పుష‌ప్స్ చేయాలి.ఇలా 4 సెట్స్ చేయాలి. దీంతో భుజ కండ‌రాలు బ‌లంగా మారుతాయి. అవి చ‌క్క‌ని ఆకృతిలోకి మారుతాయి.
ఇక ఏదైనా బెంచికి వీపును ఆనించి కూర్చోవాలి. అనంత‌రం చేతుల‌ను వెన‌క్కి పెట్టి బెంచిని ప‌ట్టుకుని శ‌రీరం పై భాగ‌న్ని పైకి కింద‌కు క‌దిలించాలి. ఈ వ్యాయామాన్ని కూడా 10 సార్లు చేయాలి. ఒక సెట్‌కు 10 సార్ల చొప్పున మొత్తం 4 సెట్లు.. అంటే 40 సార్లు చేయాలి.
ఏదైనా బ‌రువును లేదా డంబెల్‌ను మెడ వెనుక‌గా పెట్టి రెండు చేతుల‌తో ప‌ట్టుకుని దాన్ని పైకి, కింద‌కు అంటూ వ్యాయామం చేయాలి. దీన్ని కూడా ఒక సెట్‌కు 10 సార్ల చొప్పున మొత్తం 4 సెట్లు చేయాలి. అంటే 40 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇది చేసేప్పుడు జాగ్రత్త.. మెడపట్టేసే అవకాశం ఉంది.
ఏదైనా ఒక చేత్తో మాత్ర‌మే డంబెల్‌ను ప‌ట్టుకుని కేవ‌లం ముంజేయితో మాత్ర‌మే ఆ డంబెల్‌ను పైకి, కింద‌కు అంటుండాలి. దీంతో ముంజేయి భాగంలో కండ‌రాలు దృఢంగా మారుతాయి. దీన్ని కూడా 4 సెట్లు చేయాలి. ఒక సెట్‌కు 10 సార్లు చేయాలి. ఇది మహిళలు చేయకున్నా ఏం కాదు.. మనకు కావాల్సింది.. చేతులు టైట్‌గా మారడమే.. కండలు కాదు కదా.!
ఇలా వీటిని చేయ‌డం వ‌ల్ల చేతులు 4 వారాల్లోనే చ‌క్క‌ని ఆకృతిని పొందుతాయి. మీరు అన్నీ చేయకపోయినా.. ఏదైనా ఒకటైనా కచ్చితంగా రోజు చేయండి. కండ‌లు తేలిన చేతులు కావాల‌ని అనుకునే వారు మాత్రం అన్నీ వ్యాయామాల‌ను ఎంచ‌క్కా ఇంట్లోనే చేసేయండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.