బొప్పాయి తిన్నాక ఈ ఆహారాలు తిన్నారంటే.. యమ డేంజర్‌..!

పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మంచివి అని మనకు తెలిసిన విషయమే. అయితే కొన్ని రకాలు పండ్లు కానీ, కూరగాయలు కానీ తిన్న తర్వాత కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.. లకపోతే.. మీరు తిన్న పండు ద్వారా ప్రయోజనం రాకపోగా.. అనవసరంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో బొప్పాయి చాలా బాగా

బొప్పాయి తిన్నాక ఈ ఆహారాలు తిన్నారంటే.. యమ డేంజర్‌..!


పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మంచివి అని మనకు తెలిసిన విషయమే. అయితే కొన్ని రకాలు పండ్లు కానీ, కూరగాయలు కానీ తిన్న తర్వాత కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.. లకపోతే.. మీరు తిన్న పండు ద్వారా ప్రయోజనం రాకపోగా.. అనవసరంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో బొప్పాయి చాలా బాగా దొరుకుతుంది. బొప్పాయి పండు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఇది ఆరోగ్యానికి చాలా మంచి చేసే పండు.. అయితే బొప్పాయితో కాస్త జాగ్రత్తగా ఉండాలి.. ఇది తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది.. ఇంతకీ ఏం తినకూడదంటే..! 
7 health benefits of papaya seeds | HealthShots

పాలు తాగకూడదు

బొప్పాయి తిన్న తర్వాత పాలు, పాల పదార్థాలను తీసుకోకూడదు. బొప్పాయి, పాలు రెండింటి కలయిక అజీర్ణం, కడుపు నొప్పి లేదా మలబద్ధకం సమస్యకు గురి చేస్తాయి. ఆకస్మికంగా కడుపు ఉబ్బరం, విరేచనాలకు కారణమవుతుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత పాలు తాగవద్దు. అలాగే బొప్పాయితో పాటు పెరుగు కూడా తీసుకూకూడదు.. బొప్పాయి తిన్న తర్వాత పెరుగు తినడం వల్ల శారీరకంగా హాని కలుగుతుంది. ఆయుర్వేద దృక్కోణంలో, బొప్పాయి వేడి గుణం కలిగి ఉంటుంది, పెరుగు చలువ గుణం కలిగి ఉంటుంది. అందుకే వీటిని కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

టీ తాగకూడదు

బొప్పాయి తిన్న తర్వాత టీ తాగడం వల్ల అది పాపైన్ ఎంజైమ్‌తో చర్య జరుపుతుంది, ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. అదనంగా టీ ఆకులలో కాటెచిన్లు ఉంటాయి, ఇవి బొప్పాయిలోని పాపైన్ సమ్మేళనంతో చర్యజరిపి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.

గుడ్డు 

బొప్పాయి తిన్న తర్వాత కోడిగుడ్లు తిన్నారంటే.. ఇక ఆగమే...ఎందుకంటే బొప్పాయి విటమిన్ సి, పాపైన్ ఎంజైమ్‌లతో సమృద్ధిగా ఉంటుంది, గుడ్డులో ప్రోటీన్, ఒమేగా-3లు ఉంటాయి. ఈ రెండింటినీ ఒకేసారి తినడం వల్ల మీ కడుపులో గందరగోళం ఏర్పడుతుంది, ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు అనారోగ్యానికి గురి చేస్తుంది. అజీర్ణం, వికారం, మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

నిమ్మకాయ అసలే వద్దు

బొప్పాయి, నిమ్మకాయలు కలిసి మీ శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని కలిగించే విష సమ్మేళనానికి దారితీస్తాయి...ఈ లోపం రక్తహీనతకు దారితీయవచ్చు, ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు అనారోగ్యానికి గురి చేస్తుంది.
బొప్పాయి తిన్న తర్వాత వీటిని తినకుండా ఉండండి. ఇక ఫుడ్ అలెర్జీ ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు, గర్భిణులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు బొప్పాయిని అతిగా తినకపోవడమే ఉత్తమం.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.