Cosmetics : అందం కోసం మేకప్ అతిగా వాడేస్తున్నారా..? మేకప్ తో క్యాన్సర్..? నిజమెంత.. !
ఈరోజుల్లో అమ్మాయిలు ప్రతిరోజు ఉపయోగించే సౌందర్య సాధనం మేకప్(makeup or Cosmetics ) .. చిన్న వయసు నుంచి ఈ విషయంపై ఎక్కువగా ఆసక్తి చూపడం, దీర్ఘకాలం దీనిని కొనసాగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పలు రకాల చర్మ సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ Caner ..

ఈరోజుల్లో అమ్మాయిలు ప్రతిరోజు ఉపయోగించే సౌందర్య సాధనం మేకప్( makeup or Cosmetics ) .. చిన్న వయసు నుంచి ఈ విషయంపై ఎక్కువగా ఆసక్తి చూపడం మొదలు పెడుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలం దీనిని కొనసాగిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల పలు రకాల చర్మ సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత అంటే..
ఈ రోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న వార్తల్లో మేకప్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుంది.. అయితే ఇలా చేయడం వల్ల క్యాన్సర్ రాదని కానీ కొన్ని అజాగ్రత్తలు వహిస్తే మాత్రం చర్మానికి సంబంధించిన పలు సమస్యలతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మహిళలకు సంబంధించిన సౌందర్య అలంకరణలను ఎన్నో ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్న మాట నిజమే. అయితే వీటిలో ఒకప్పుడు ప్రమాదకరమైన కెమికల్స్ ను ఉపయోగించేవారు. అంతేకాకుండా అమోనియా లాంటివి వాడటం వల్ల చర్మానికి ఎంతో ప్రమాదం జరిగేది. అయితే తర్వాత వీటి విషయంలో నిషేధం విధించారు.
అయితే ప్రస్తుతం ఉపయోగించే సౌందర్య సాధనాల్లో అమోనియా ఉపయోగించటం లేదు.. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కానీ బయట తేలికగా దొరికే క్రీములు మేకప్ సామాన్లు ఉపయోగించడం వల్ల మాత్రం పలు రకాల సమస్యలు వస్తాయని తెలుస్తోంది. అందుకే దీని నుంచి బయటపడటానికి మేకప్ విషయంలో మాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదని.. బ్రాండెడ్ వస్తువుల్ని వాడటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని తెలుస్తోంది..
అయితే ప్రతి ఒక్కరి శరీరతత్వం ఒకేలాగా ఉండదు. దీనివలన కొన్ని రకాల మేకప్ సామాన్లు వాడినప్పుడు చర్మానికి సంబంధించిన అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతిసారి చర్మ క్యాన్సర్ కు దారితీస్తుందని మాత్రం చెప్పలేము.. అందుకే కొన్ని రకాల క్రీములు, మేకప్ వాడే ముందు అది చర్మానికి సరిపోతుందా లేదా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం ఎంతైనా మంచిది.. అలాగే ఒకరి చర్మానికి సరిపడే మేకప్ వస్తువులు మరొకరికి సరిపోతాయి అని కూడా పూర్తిగా చెప్పలేము. ఇలాంటి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం.
అలాగే చాలామంది బయట తిరిగి వచ్చి మేకప్ ను తీయడానికి ఇష్టపడరు. దీనివలన బయట ఉండే కాలుష్యం, దుమ్ము, ధూళి అన్నీ కూడా చర్మంపై చేరుతాయి. అందుకే రాత్రి సమయంలో మేకప్ ను పూర్తిగా తీసి నిద్రపోవడం మంచిదని తెలుస్తోంది.. అలాగే మేకప్ ను తొలగించడానికి సహజ సిద్ధంగా లభించే పాలను ఉపయోగించడం వల్ల నాకు పూర్తిగా తొలగిపోతుందని తెలుస్తోంది..