స్మోకింగ్ తో మెమొరీ లాస్... !

ఆరోగ్యానికి ఎంతో హానికరమని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలినప్పటికీ ఈ అలవాటును మానటానికి చాలామంది ఇబ్బంది పడతారు అయితే దీనివలన శ్వాస కోసం సంబంధిత

స్మోకింగ్ తో మెమొరీ లాస్... !
Smoking


ఆరోగ్యానికి ఎంతో హానికరమని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలినప్పటికీ ఈ అలవాటును మానటానికి చాలామంది ఇబ్బంది పడతారు అయితే దీనివలన శ్వాస కోసం సంబంధిత వ్యాధులతో పాటు నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని తెలుస్తోంది.. 

ధూమపానం అలవాటు ఉన్నవారికి మెమొరీ లాస్ ప్రతి విషయానికి కన్ఫ్యూజ్ అవ్వటం వంటి వ్యాధులు కూడా వస్తాయని తాజాగా తేలింది.. స్మోకింగ్ ను ఎక్కువ కాలం కొనసాగించిన వాళ్ళలో చిన్న వయసులోనే ప్రతి విషయాన్ని మరిచిపోవడం చిన్న చిన్న విషయాలకే కన్ఫ్యూజ్ అవటం వంటి సమస్యలు వస్తాయని తెలుస్తోంది..

అలాగే పొగ తాగే వారిలో శ్వాసకోస ఆరోగ్యం గుండెకు సంబంధించిన ఆరోగ్యం ప్రభావం కావడమే కాకుండా నాడీ సంబంధిత వ్యవస్థపై కూడా ఎంతో ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది అందుకే ఈ అలవాటును మానుకుంటే ఈ అనారోగ్యాలు అన్నిటి నుంచి దూరం కావచ్చని చెబుతున్నారు.. 

అలాగే స్మోకింగ్ తో అల్జీమస్ డిమెన్షియా వంటి వ్యాధులు సైతం వస్తాయని తెలుస్తోంది.. అలాగే మధ్య వయస్కులు స్మోకింగ్ అలవాటును మానేస్తే వారి గ్రహణ శక్తి ఎంతగానో మెరుగుపడిందని తేలింది అయితే కొంచెం వయసు పైబడిన వారిలో పెద్ద ప్రభావం చూపించలేదని వారు మరింతగా మతిమరుపు వంటి సమస్యలతో వృద్ధాప్యంలో బాధపడుతున్నట్టు తెలుస్తోంది అందుకే స్మోకింగ్ ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మానేయాలని చెబుతున్నారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.