వేసవిలో శరీరానికి మేలు చేసే ఆహారం ఏంటంటే..

వేసవికాలంలో కచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కాలంలో దొరికే పండ్లను, కాయగూరలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.

వేసవిలో శరీరానికి మేలు చేసే ఆహారం ఏంటంటే..


వేసవికాలంలో కచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కాలంలో దొరికే పండ్లను, కాయగూరలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.

ఈ సమయంలో ఎక్కువగా దొరికే మామిడి పండ్లలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని రోజు మజ్జిగ అన్నంతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది.

వేసవిలో పనసకాయలు, పుచ్చకాయలు ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా పుచ్చకాయ శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అందుకే దీనిని ఏ రూపంలో తీసుకున్న మంచిదే.

చిక్కుడు జాతి కాయగూరలు, కాలీఫ్లవర్, మొక్కజొన్న, కాకరకాయ, మెంతులు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

పప్పు అన్నం, తియ్యని పళ్ళు, ఈ కాలంలో దొరికే అన్ని రకాల కాయగూరలు, పటిక బెల్లం కలిపిన పాలు, శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ములక్కాడ, బాదం, తేనె వంటివి ఎండాకాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు.

అలాగే ప్రతిరోజు అన్నం తినే ముందు ఒక ముద్దలో ధనియాల పొడి కానీ మెంతిపొడి కానీ సొంటిపొడి కానీ కలిపి ఒక చెంచా నెయ్యి వేసుకొని తినడం వల్ల శరీరంలో ఉండే రోగాలు అన్ని పోతాయి. జీర్ణశక్తి సక్రమంగా ఉంటుంది.

సాధారణంగా 75% పొట్ట నిండిన వెంటనే తినటం ఆపెయ్యటం మంచిది. తిన్న తర్వాత గంట ఆగి నీటిని తాగడం వల్ల జర్ణ క్రియ కి ఎలాంటి ఆటంకాలు ఉండవు.

ఎండాకాలంలో కారం ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే మాంసాహారం, వెన్న, నూనెతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పొగాకు, మద్యం మానుకోవాలి. అలాగే శీతల పానీయాలు, ఐస్ క్రీమ్లు, గడ్డ పెరుగు వంట వాటికి దూరంగా ఉండటమే మేలు. కొంత మోతాదులో వెల్లుల్లి తీసుకోవడం మేలు ఎక్కువగా తీసుకోరాదు. 

ఎక్కువకాలం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ప్రాసెసింగ్ మాంసం, ఎక్కువగా కాఫీ, టీ వంటి వాటిని తీసుకోరాదు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.