Beauty : చర్మంపై శోభి మచ్చలా..? ఇలా తగ్గించేయండి..!

Beauty : చర్మానికి ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీటి నుంచి మనం తప్పించుకోలేం.. పోషకాల లోపం, హార్మోన్‌ ఇంబాలెన్స్‌, లైఫ్‌స్టైల్‌ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.

Beauty : చర్మంపై శోభి మచ్చలా..? ఇలా తగ్గించేయండి..!


Beauty : చర్మానికి ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీటి నుంచి మనం తప్పించుకోలేం.. పోషకాల లోపం, హార్మోన్‌ ఇంబాలెన్స్‌, లైఫ్‌స్టైల్‌ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. మ‌న‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌లో శోభి మ‌చ్చ‌లు కూడా ఒక‌టి. ఇవి ఒక చోట ప్రారంభమై శ‌రీరమంత‌టా వచ్చేస్తాయి...ఇవి శ‌రీరంపై ఏదో ఒక చోట చిన్న‌గా తెల్ల‌ని మ‌చ్చ‌లా ఏర్ప‌డి క్ర‌మేపీ పెద్ద‌గా అయ్యి శ‌రీర‌మంతా విస్త‌రించి శ‌రీరాన్ని శోభితో క‌ప్పేస్తాయి. వీటివల్ల ఎలాంటి నొప్పి ఉండదు కానీ అందవిహీనంగా మారుతారు. చూసేవాళ్లు అదేదో అంటువ్యాధి అనుకోని దూరం పెడతారు.  

శోభి మచ్చలు రావడానికి కారణాలు..
 
హార్మోన్‌ల‌లో మార్పులు, రోజూ మందులు మిగ‌డం వంటి వాటి వ‌ల్ల ఈ మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి. 
వేడి శ‌రీరం ఉన్న వారిలో ఈ మ‌చ్చ‌లు రావ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. 
ఈ మ‌చ్చ‌లు వ‌చ్చిన వెంట‌నే చికిత్స తీసుకోవ‌డం చాలా మంచిది. లేదంటే ఇవి శ‌రీరం అంత‌టా వ్యాపించి అంద‌విహీనంగా త‌యారు చేస్తాయి. ఇవి వ‌చ్చిన త‌రువాత మందుల‌ను వాడ‌డం చాలా మంచిది. ఈ మ‌చ్చ‌ల‌కు ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి..

శోభి మ‌చ్చ‌ల‌ను త‌గ్గించ‌డంలో ఉత్త‌రేణి మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉత్త‌రేణి మొక్క వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా పెరుగుతుంది. ఈ మొక్కను మీరు చూసే ఉంటారు. కాకపోతే పేరు తెలియదు.. మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్కడ‌ క‌నిపిస్తూనే ఉంటుంది. ఉత్త‌రేణి మొక్క‌ను ఉప‌యోగించి శోభి మ‌చ్చ‌ల‌ను ఎలా తగ్గించుకోవాలంటే..


ఉత్త‌రేణి మొక్క మొత్తాన్ని సేక‌రించి శుభ్ర‌పరిచి ఎండ‌బెట్టుకోవాలి. దీనిని నిప్పుల‌పై వేసి కాల్చితే వ‌చ్చిన బూడిద‌ను జాగ్ర‌త్త‌గా సేక‌రించాలి. ఈ బూడిద‌ను కావ‌ల్సిన ప‌రిమాణంలో తీసుకుని దానికి ఆవ‌నూనెను క‌లిపి పై పూత‌గా రాయ‌డం వ‌ల్ల శోభి మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. ఇలా ప్ర‌తిరోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా నెల‌రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల ఈ మ‌చ్చలు త‌గ్గుతాయి. ఈ విధంగా ఉత్త‌రేణి మొక్క‌ను ఉప‌యోగించి శోభి మ‌చ్చ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. సమస్య ఉంటే ట్రై చేసి చూడండి.!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.