Summer safety tips : సూర్యుడి నుంచి రక్షణ ఎలా....?

summer tips : ఎండాకాలం నెమ్మదిగా మొదలవుతుంది. నడినెత్తిన సూర్యుడు నిల్చుని శరీరంలో నీళ్లంతా స్వాహా చేసేస్తున్నాడు. దానికి తోడు చెమట ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. సాధారణంగా ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా చర్మ సమస్యలు బయలుదేరుతాయి. 

Summer safety tips : సూర్యుడి నుంచి రక్షణ ఎలా....?
How to protect from the sun


అప్పుడే మండిపోతున్నాడు సూర్యుడుబయట అడుగుపెట్టాలంటేనే మదనపడిపోతున్నారుఇంకా అసలైన ఎండాకాలంలో పరిస్థితి చెప్పనక్కర్లేదేమో...... అలాంటి సమయాల్లో దేహానికి కాస్త బందోబస్తు కావాలి మరి.ఎండాకాలం నెమ్మదిగా మొదలవుతుందినడినెత్తిన సూర్యుడు నిల్చుని శరీరంలో నీళ్లంతా స్వాహా చేసేస్తున్నాడుదానికి తోడు చెమట ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందిసాధారణంగా ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతలుఉక్కపోత కారణంగా చర్మ సమస్యలు బయలుదేరుతాయిలేని వారికి కూడా సమస్యలు వస్తాయిఅలాంటప్పుడు మరి జాగ్రత్త అవసరం కదా....

వేసవి బాధల నుంచి బయటపడేందుకు అమ్మాయిల కష్టాలు అంతాఇంతా కాదుమొటిమలు తగ్గడానికి ఇంటి చిట్కాలు తెగ పాటించేస్తుంటారుపార్లర్లకు వెళ్తుంటారుజంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలంటూ.....నియమాలన్నీ అమలు చేసేస్తుంటారుసాధారణంగా వేసవిలో బయట కాలు పెట్టేప్పుడు....నెత్తిన టోపీముఖానికి మాస్క్చేతులకు గ్లౌజులుచేతిలో నీళ్లసీసాగొడుగు తప్పనిసరిఎందుకంటే సూర్యకిరణాలు డైరక్ట్ గా మనపై పడిన సమస్యలు రాకుండా ఉండటానికి....ఇవన్నీ పాటిస్తాంవేసవిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం జిడ్డుగా మారడం ఖాయంమరి ముందునుంచే జిడ్డు చర్మం ఉండే అమ్మాయిలు మాత్రం ఇంకాస్త అవస్థలు పడుతుంటారుదాని వల్ల పొక్కులుఅలెర్జీ వంటి వస్తాయిచర్మం పొడిబారిపోవడం కూడా జరుగుతుంది.

అయితే మొటిమలుచర్మ సమస్యలకు దూరంగా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతున్నారువేసవిలో ఫైబర్ మోతాదు ఉండే పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారునట్స్ఓట్స్‌బార్లీఆపిల్‌క్యారెట్‌అవిసె గింజలుజామతృణధాన్యాలు రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.... చర్మంలో ఉండే నూనెలు బయటకు వస్తాయని చెబుతున్నారువిటమిన్‌ ఏ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడంతో పాటు మచ్చలుమొటిమలను తొలగిస్తాయని చెబుతున్నారుపాలకూరచిలగడ దుంపక్యారెట్పాలుపెరుగుచీజ్ గుడ్లుసాల్మన్ చేపగుమ్మడికాయ గింజలుకిడ్నీ బీన్స్చికెన్రెడ్‌మీట్‌గుడ్లు తింటే మంచిది.

ఇంకో విషయం మర్చిపోకు మిత్రమా.....అదే కరకరలాడే బజ్జీలుపకోడీలకు దూరంగా ఉండాల్సిందేఅవి రోజు తింటే పిండిపదార్థాలునాణ్యత లేని నూనెలు ఉండటం వల్ల చర్మంలో కొవ్వులు పేరుకుపోతాయిరక్త ప్రసరణను కూడా దెబ్బతీస్తుందిసోడాలుప్యాకేజ్డ్ ఫుడ్స్క్రిస్పీ ఫుడ్స్ఫ్యాట్ ఫుడ్స్స్వీట్స్‌ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.

మామూలుగా ఉప్పు అనేది చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలివేసవిలో ఉప్పు ఎక్కువగా తినడం వల్ల మొటిమలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందికచ్చితంగా రోజూ నీళ్లు తాగడం మర్చిపోవద్దు సుమా....అసలు నీళ్లు తాగకపోవడం వల్లే అసలు సమస్యలు వస్తాయివ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయిరోజూ నీళ్లు తాగడం వల్ల చర్మంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వచ్చేయడంతో కాంతివంతంగా కనిపిస్తుందిటాక్సిన్స్‌ కూడా తొలగిపోతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.