నిద్రపోయే ముందు ఫోన్ చూస్తున్నారా.. భవిష్యత్తులో ఈ సమస్యలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే!

ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90% మంది మొబైల్ వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే ఈ మొబైల్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరి అవసరం లేకుండా మొబైల్ తో మాత్రమే గడుపుతూ దానిని వ్యసనం చేసుకొని  లేకపోతే ఇబ్బంది పడే వారి సంఖ్య రోజుకి బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఈ మొబైల్ వాడడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు మనల్ని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిద్రపోవడానికి ముందు

నిద్రపోయే ముందు ఫోన్ చూస్తున్నారా.. భవిష్యత్తులో ఈ సమస్యలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే!


ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90% మంది మొబైల్ వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే ఈ మొబైల్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరి అవసరం లేకుండా మొబైల్ తో మాత్రమే గడుపుతూ దానిని వ్యసనం చేసుకొని  లేకపోతే ఇబ్బంది పడే వారి సంఖ్య రోజుకి బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఈ మొబైల్ వాడడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు మనల్ని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిద్రపోవడానికి ముందు మొబైల్ ఫోను చూస్తే ఏ ఏ సమస్యలు వస్తాయి అంటే..
Blue light has a dark side - Harvard Health
నిద్రపోయేముందు మొబైల్ చూసి పడుకునేటట్టు అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ అది ఎంత మాత్రం మంచిది కాదు అని నిపుణులు తెలియజేస్తున్నారు. 
నిద్రపోయే ముందు మొబైల్ ని చేతితో ఒకే దిశలో ఎక్కువసేపు పట్టుకొని ఉంచడం వల్ల చేతినొప్పి రావడంతో పాటు మరిన్ని సమస్యలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మొబైల్ ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల మెడ నొప్పి వెన్నునొప్పి సైతం తలెత్తే అవకాశం ఉంది కేవలం ఒకే దగ్గర కూర్చొని ఫోన్ ఎక్కువసేపు చూడటం వల్ల మెడ దగ్గర ఉండే నరాలు స్ట్రెస్ కు గురవుతాయి. మెడ నొప్పి ఎక్కువగా  రావడంతో పాటు సెర్వికల్ స్ట్రెయిన్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
రాత్రి సమయంలో లైట్స్ ఆఫ్ చేసి.. నిద్ర పోయేముందు గదిలో  ఉన్న లైట్స్ ఆఫ్ చేసి మొబైల్ చూడడం వల్ల కంటి పైన అధిక ఒత్తిడి కలిగి దురద, చికాకు, కళ్ళు మంటలు పుట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
 లైట్స్ ఆఫ్ చేయడం వలన మిగిలిన సమయంతో పోలిస్తే మన కళ్ళు ఎక్కువగా పనిచేయవలసి ఉంటుంది. అందువల్లనే ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేసి మొబైల్ ని చూడవద్దని హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా రాత్రి సమయంలో మొబైల్స్ ఎక్కువగా వినియోగించడం వలన మానసిక ఒత్తిడి పెరిగిపోయి నిద్రలేక అనేక సమస్యలు ఉపక్రమించే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.
 ముఖ్యంగా రాత్రి సమయాల్లో మొబైల్స్ చూడడం ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిదని లేదంటే రేడియేషన్ బారిన పడి అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవాల్సి ఉంటుందని నిపుణుల హెచ్చరిస్తున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.