నడక ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే షాకవుతారు

ఆరోగ్యం కుదుటగా ఉండాలంటే కొన్ని పాటించాలి. అది కష్టమైనా సరే పాటించాల్సిందే. మన ఆహారం విషయంలోనైనా శారీరకంగానైనా జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. శారీరకంగానైనా, మానసికంగానైనా ఆరోగ్యం బాగుండాలంటే నడక చాలా మంచిది. వ్యాయామాల్లో

నడక ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే షాకవుతారు


ఆరోగ్యం కుదుటగా ఉండాలంటే కొన్ని పాటించాలి. అది కష్టమైనా సరే పాటించాల్సిందే. మన ఆహారం విషయంలోనైనా శారీరకంగానైనా జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. శారీరకంగానైనా, మానసికంగానైనా ఆరోగ్యం బాగుండాలంటే నడక చాలా మంచిది. వ్యాయామాల్లో కెల్లా ఉత్తమమైనది నడక.



నడక వల్ల చాలా లాభాలుంటాయి. కానీ దాన్ని మనం నిర్లక్ష్యం చేసేస్తుంటాం. వీధిలో ఉన్న దుకాణానికి వెళ్లాలన్న బైక్‌ వాడేస్తుంటాం. ప్రతిదానికి నడకను వదిలేసి బైక్‌మీదనో, కారుమీదనో వెళ్లిపోతుంటాం. ఇంట్లో పనులకు కూడా పనిమనుషులను పెట్టుకుంటున్నాం. దానివల్ల పూర్తిగా ఒంగడం, నడవడం మానేసాం. మన ఇంట్లో పని చేయడానికి ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. ఈ టెక్నాలజీ వల్ల పనులు చాలా సులువుగా అయిపోతున్నాయి. మన ఆఫీస్ పని ఎక్కువగా మానసికంగా ఉంటుంది తప్ప, శారీరకశ్రమ తక్కువే. మనం ఎక్కువ నడవడం లేదు. ఏ పనైనా ఇంట్లో ఉండి కనీసం బయటికి వెళ్ళనవసరం లేకుండా చేయవచ్చు. ఒకవేళ బయటికి వెళ్ళాలి అన్నా మనకి కార్ లు లేదా, బైక్స్ వున్నాయి. ఈ మార్పులన్నీ మన జీవితంలో పెద్ద కదలిక లేకుండా చేశాయి. కావాలని శారీరక శ్రమ చేస్తే....తప్ప శారీరక శ్రమ ఉండే అవకాశం లేదు.

మనం శారీరకంగా దృఢంగా ఉండడానికి ఉన్న సులువైన పద్ధతి నడవడం. దీనికి ఎలాంటి యంత్రాలు, ప్రత్యేక ప్రదేశాలు అవసరం లేదు. మనం ఎక్కడైనా నడవచ్చు. మన బాల్కనీలో,  టెర్రస్ పైన, హాల్లో ఎక్కడైనా. మనం నడవాలి అనుకుంటే చాలు. నడవడం అనేది శారీరకంగా మానసికంగా ఎమోషనల్గా ఎన్నో లాభాలను ఇస్తుందని సైన్స్ చెప్తుంది.

నడవడంవల్ల వచ్చే లాభాలు ఏమిటి ?....ఒక వ్యక్తి వారానికి 4 గంటల కన్నా ఎక్కువ నడిస్తే అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని, గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కదలిక లేకుండా గడపడంవల్ల వచ్చే మొదటి సమస్య ఊబకాయం. ఊబకాయం ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నడవడం అనేది బరువును తగ్గించి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఊబకాయం రాకుండా కాపాడుతుంది. ఈ మధ్యకాలంలో 40 ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్లు కూడా డయాబెటిస్, ఎక్కువ కొలెస్ట్రాల్, ఎక్కువ బీపీ లాంటి సమస్యలను ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇవి రాకుండా చూసుకోవడం చాలా సులువు. రోజు క్రమం తప్పకుండా నడవటం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.