Digestive system : జీర్ణాశయం సక్రమంగా పనిచేయటానికి ఓ ఆహారం ఉందండి.. తెలుసుకొని జాగ్రత్త పడదామా మరి..!

Digestive system : పళ్లెంలో ఎన్నో రకాల ఆహార పదార్ధాలు పెట్టుకొని తినేవారు ఒక్కోసారి ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. కానీ ఉన్నంతలో తృప్తిగా భోజనం చేసి ప్రశాంతంగా గడిపేవారు కలకాలం జీవిస్తారు. దేనికైనా ఆచరణ చాలా ముఖ్యం కదా మరి  digestive system కి కూడా ఒక ఆహారం ఆచరణ కచ్చితంగా ఉన్నాయి.

Digestive system : జీర్ణాశయం సక్రమంగా పనిచేయటానికి ఓ ఆహారం ఉందండి.. తెలుసుకొని జాగ్రత్త పడదామా మరి..!
proper functioning of the digestive system


Best food to improve digestive system : పళ్లెంలో ఎన్నో రకాల ఆహార పదార్ధాలు పెట్టుకొని తినేవారు ఒక్కోసారి ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. కానీ ఉన్నంతలో తృప్తిగా భోజనం చేసి ప్రశాంతంగా గడిపేవారు కలకాలం జీవిస్తారు. దేనికైనా ఆచరణ చాలా ముఖ్యం కదా మరి  digestive system కి కూడా ఒక ఆహారం ఆచరణ కచ్చితంగా ఉన్నాయి. వీటిని పాటిస్తేనే శరీరం అనే ఇంధనం సక్రమంగా పనిచేస్తుంది. అప్పుడే మనిషి నూరేళ్లు కాకపోయినా బతికున్నాన్నాళ్లు ఆనందంగా బతికేయగలడు..
చక్కని ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థ అంటే కేవలం జీర్ణాశయం మాత్రమే కాదు.. అందులో ఎన్నో అంశాలు ఉంటాయి. తిన్న ఆహారాన్ని సక్రమంగా శరీరం వంట పట్టించుకోవాలి అంటే అందులో ఎన్నో కొన్ని పోషకాలేనా కచ్చితంగా ఉండాలి కదా మరి అందుకే శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలి అంటే తీసుకునే ఆహారంలో పోషక విలువలు కచ్చితంగా ఉండాలి. అవి అంత సూక్ష్మ రూపంలో శరీరానికి పట్టాలి అంటే మంచి ఆహారమే అవ్వాలి. అయితే జీర్ణాశయం ఆరోగ్యానికి తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే.

ఏం చేయకూడదంటే.. 

ముఖ్యంగా జీర్ణ క్రియ ని ఇబ్బంది పెట్టే పనులు కొన్ని ఉంటాయి. తెలియకుండానే వీటిని మనం చేసేస్తూ ఉంటాము. అందులో ముఖ్యంగా అన్నాన్ని గబగబా తినేయటం, పూర్తిగా నమలకుండా ఆహారం తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయని కడుపునిండా తినటం కూడా సరికాదు. అలాగే తినే సమయంలో నీటిని తీసుకోవటం, మందు తాగటం వంటి పనులు చేయకూడదు. అర్ధరాత్రి సమయాల్లో ఆహారం తీసుకోవడం వంటి పనులు చేయకూడదు. 

ఏం చేయాలంటే.. 

ప్రతిరోజు ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే అన్నం తిన్న తర్వాత గంట తర్వాత మాత్రమే నీటిని తాగాలి. తినే ఆహారం మొదటి ముద్దలో ధనియాలు, జీలకర్ర సొంటి పొడిని కలుపుకొని తీసుకోవడం వల్ల ఎలాంటి జీర్ణాశయ సమస్యలు దరి చేరవు.
అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళ రసాలు తీసుకోవాలి. మజ్జిగ మంచినీరు వంటివి తీసుకోవడం మంచిది. అధికంగా వేయించిన ఆహార పదార్థాలు మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అధికంగా మసాలా వంటి పదార్థాలు తీసుకోకూడదు కాఫీ టీ వంటి వాటిని అదుపులో ఉంచాలి. పంచదారని కూడా అదుపులో ఉంచడం మంచిది. గ్రీన్ టీ పశుపాలు బెల్లం పాలు జీర్ణాశయానికి మంచిది. నీళ్లు దానిమ్మ రసం ధనియాల చారు వంటివి జీర్ణవ్యవస్థని సక్రమంగా ఉంచడానికి పనిచేస్తాయి. అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు అనే విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.